చంద్రబాబుపై YS జగన్ (YS Jagan)మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. తాజాగా 2025–26 ఆర్థిక సంవత్సరపు తొలి ఆరు నెలలకు సంబంధించిన CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాలను X వేదికలో (YS Jagan) షేర్ చేసారు..
Read Also: Ramoji rao: రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి
2025-26 FY తొలి 6 నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేశారు. రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% ఉండగా, ప్రభుత్వం పేర్కొంటున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. తమ హయాంలో పన్నుల వృద్ధి 9.87% ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అప్పులు మాత్రం భారీగా పెరిగి రూ.2,06,959 కోట్లకు చేరాయని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: