YS Jagan Case: పోలింగ్ రోజు ధర్నా ఎఫెక్ట్.. జగన్‌, అవినాష్ రెడ్డిపై కేసు నమోదు!

Follow Us: Google News Daily Hunt
The police have registered a case against Y.S. Jagan for staging a protest in front of the Returning Officer’s (RO) office on the day of the Pulivendula municipal elections. Cases have also been filed against other YSRCP leaders, including MP Avinash Reddy.
The police have registered a case against Y.S. Jagan for staging a protest in front of the Returning Officer’s (RO) office on the day of the Pulivendula municipal elections. Cases have also been filed against other YSRCP leaders, including MP Avinash Reddy.
FONT SIZE
GET APP

YS Jagan Case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు పులివెందులలో షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపైనా కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు జగన్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి నియోజకవర్గానికి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లతో కలిసి ఆర్వో కార్యాలయం ముందు బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.

Read Also :Cyclone Effect : కష్ట సమయంలో ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది – అమిత్ షా

YS Jagan Case

తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని చోట్ల టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాలను ఆక్రమించారని జగన్ ఆరోపించారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్వో జగన్ నుంచి వినతిపత్రాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించడం కూడా కష్టమవుతుందని అన్నారు. తాను ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే ఎన్నికలను అడ్డుకునే పిలుపు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

YS Jagan Case: మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఈ ఘటనలపై విచారణ చేయిస్తామని జగన్ అన్నారు. అనంతరం రీపోలింగ్‌కు అనుమతిస్తేనే తిరిగి వచ్చి ఓటు వేస్తానని చెబుతూ ఓటు వేయకుండానే బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే, పోలింగ్ రోజు ఆర్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు