ఏ దేశానికైనా నైపుణ్యాలతో కూడిన యువత ప్రధాన బలం. ప్రపంచంలో అత్యధిక యువజనాభా గల దేశం మనదే. ప్రపంచ యువజనాభా 180కోట్లుగా ఉంటే.. అందు లో 28 శాతం వాటా మనదే. మరి మన యువతలో ఉం డాల్సినంత ఉత్తేజం, ఉత్సాహం ఉన్నాయా? అంటే వెంటనే జవాబు వచ్చే పరిస్థితి లేదు. అటు ప్రపంచ వ్యాప్తంగా అభి వృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నింటిలోనూ ఇదే దుస్థితి. మరోవైపు, 21వ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ యువతను (youth) ఉమ్మడి లక్ష్యాల వైపు నడిపించగలిగితేనే ప్రపం చాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నా రు. ఈ క్రమంలో ప్రతిదేశంలోనూ అక్కడి పరిస్థితులు, అవకాశాలు, పరిమితుల ప్రాతిపదికగా యువత కోసం ఒక నైపు ణ్యాభివృద్ధి ప్రణాళికను ఆయా ప్రభుత్వాలు రూపొందించు కోవాలని వారు సలహాఇస్తున్నారు. దేశీయ అవసరాలు తీర్చుకుంటూనే, ప్రపంచ అవసరాలకు తమ మానవవనరులను సిద్ధం చేసే రీతిలో ప్రభుత్వాలు ఈప్రణాళికను సిద్ధం చేయగలిగితే ఈ గ్లోబల్ యుగంలో ఉపాధి కొరతను అధిగమించ టమేగాక ప్రపంచ అవసరాలు తీరుతాయనేది వారు సూత్రీ కరిస్తున్నారు. ఇక మనదేశం విషయానికి వస్తే ఇనుప కండ రాలు, ఉకునరాలు, వజ్ర సంకల్పమున్న యువతకు (youth) సరైన మార్గ నిర్దేశకత్వం లభిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని నాటి వివేకానందుడి మొదలు నేటి వరకు పలువురు చెబుతునూ ఉన్నారు. ప్రశ్ననుఆయుధంగా మలచుకుని, తర్కంతో వినూత్న ఆవిష్కరణలు చేయగల సామర్థ్యం యువభారతానికి ఉందని నేటి భారత విజయాలు చెబుతున్నప్పటికీ.. కొన్ని అనివార్యతలు ఈ సానుకూల పరిణామానికి అడ్డు గోడలుగా నిలుస్తున్నాయి.
Read Also : Tobacco: పెరుగునున్న పొగాకు ధరలు?

నినాదంగా మిగిలిన విద్య
ప్రపంచపు అతిపెద్ద జనశక్తిగా ఉన్న భారతదేశంలో పేదరికం కారణంగా నేటికీ అందరికీ విద్య అనేది నినాదంగా మిగిలిపోయింది. దేశంలో ప్రాథమిక విద్య మొదలు అన్ని స్థాయిలలో మూసధోరణిలో సాగుతున్న విద్యా వ్యవస్థలను సంస్కరించటంతోబాటు యువత భవిష్య తు దారులు పరిచే మన విశ్వవిద్యాలయాల్లోని బోధన, పరిశోధనాపరమైన వసతులను మెరుగుపరచాలని రెండు దశాబ్దాలుగా విద్యావేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. గత పదేళ్లుగా ఈ దిశగా కొంత సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఈ వ్యవస్థలు ఇంకా పూర్తిగా గాడిన పడలేదనేది కాదనలేని వాస్తవం. ప్రపంచ మార్కెట్లో బోలెడన్ని ఉపాధి అవకాశాలున్నప్పటికీ, వాటిని అందిపుచ్చుకో గల నైపుణ్యాలు మన యువతకు లేకపోవటంతో నేటికీ దేశంలో యువత ఉపాధి అనేది పెద్ద సమస్యగా మారింది. ఇంత పెద్ద దేశంలో కేవలం ఢిల్లీ, హర్యానాలలో మాత్రమే రాష్ట్ర స్థాయిలో స్కిల్ వర్సిటీలుండగా, ఇటీవలే తెలంగాణ లోనూ అలాంటి ప్రయత్నం జరుగుతోంది. వాస్తవానికి ప్రతి రాష్ట్రానికి ఇలాంటి వర్సిటీ అవసరముందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. భారత్లో 15-29ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తుండగా, స్థూల దేశీయోత్పత్తిలో వీరి వాటా 34 శాతంగా ఉంది. రాబోయే ఇరవయ్యేళ్ల కాలంలో యువ జనాభా విషయంలో మనదేశాన్ని మరే దేశమూ అందుకోలేదనే మాటలు ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు ఆందోళనను కలిగిస్తున్నాయి. పనిచేయగల వయసులో ఉన్న యువత పెద్ద సంఖ్యలో ఉండటం ఈసంతోషానికి కారణ మైతే, వారికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణ అందటం లేదనే వాస్తవం ఆందోళనకు కారణమవుతోంది.
నిరుద్యోగులు
దేశంలో డిగ్రీ చదివిన వారిలో 35.2శాతం, పీజీ పట్టా పుచ్చుకున్నవారిలో 36.2శాతం,సంప్రదాయ వృత్తి విద్యా కోర్సులను అభ్యసించినవారిలో 33 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోవటం లేదా తమ చదువుకు తగని చిన్నాచితకా కొలువులతో జీవితాలను నెట్టుకొస్తున్నారని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఇక పురుషులతో పోల్చితే యువతుల్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశ జనాభాలో 48శాతం వాటా మహిళలదే అయి నా కార్మిక శక్తిలో నేటికీ వారి భాగస్వామ్యం 20 శాతమే! మహిళలకు అనువైన ఉద్యోగాల కల్పనలోనూ మన ప్రభు త్వాల వైఫల్యం, పురుషాధిక్య భావజాలం, మెరుగైన పని వాతావరణం, ఇంటి నుంచి పని ప్రదేశాలకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవటం, పిల్లలు, కుటుంబం బాధ్యతలు పూర్తిగా కుటుం బంలోని మహిళల మీదనే పడటం వంటి అనేక కారణాలు మనదేశంలో మహిళాశక్తికి సమానావకాశాలను దూరంచేస్తున్నాయి. ఏటా దాదాపు 1.1 కోట్ల దేశీయ యువత కొత్తగా ఉద్యోగాల వెతుకులాట మొదలు పెడుతుండగా, వారిలో సగం మంది తగిననైపుణ్యాలు లేవని జాతీయస్థాయి సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు, తమ సంస్థ లలో పనిచేయటానికి మెరుగైన మానవవనరులు దొరకటం లేదంటూ పలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వాపోతున్నాయి.తగిన నైపుణ్యాలను యువతకు అందిస్తూ ఈలగాధాన్ని పూడ్చటమే ఇప్పుడు మనప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు!

అంతరాలు
మన దేశ కార్మికశక్తిలో 92 శాతాని కిపైగా అసంఘటిత రంగంలో ఉండగా, 8శాతం మంది మాత్రమే సంఘటిత రంగంలో సేవలందిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల అవసరాలు పూర్తిగా భిన్నమైనవే అయినా, యువతకు నైపుణ్యాలను అందించి, వారిని నిలకడగల ఉపాధి బాటపట్టించటం అవసరం. అలాగే దేశశ్రమశక్తిలో ప్రాంతాల వారీగానూ స్పష్టమైన అంతరాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళ నాడు, ఏపీలలో యువ జనాభా తగ్గుతుండగా, రాజస్థాన్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో యువ జనాభా ఎక్కువగా ఉంది. అయితే ఉత్తరాది యువత సాంకేతిక విద్యలేక సంప్రదాయ వృత్తులకే పరిమితం అవు తుండగా, దక్షిణాది యువత టెక్ నైపుణ్యాలను అందిపుచ్చుకుని విదేశీబాటపడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్దితే కాస్త ఆలస్యంగానైనా ఈ అంతరాలను సరిచేయవచ్చు. దేశంలో 2022 నాటికి 40కోట్ల యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి, భిన్నరంగాల్లో వారిని తిరుగులేని మానవ వనరులుగా మలచే లక్ష్యంతో 2015లో మోడీసర్కారు తెచ్చి న నైపుణ్య భారత్ కార్యక్రమం కొన్నిరంగాలకే పరిమితం కావటం, తర్వాత వచ్చిన కొవిడ్ వివత్తుమూలంగా కొంతమేర మాత్రమే విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని మరోసారి సంస్కరించి, మరింత సమగ్రంగా ఈకార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో విద్యాసంస్థలను విధిగా భాగస్వాములను చేస్తూ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరముందని విద్యా వేత్తలు గట్టిగా సూచిస్తున్నారు. అలాగే, 2016లో ప్రారంభ మైన స్టార్టప్ ఇండియా మూలంగా, అత్యధిక సంఖ్యలో అంకుర సంస్థలున్న మూడో దేశంగా భారత్ను మార్చినా స్టార్టప్లకు కావలసిన సదుపాయాలు, అనువైన వాతావరణం దేశంలో నేటికీ ఏర్పడలేదు. మనదేశంలో 94 శాతానికిపైగా స్టార్టప్లు నిధులు, తగిన మార్కెట్ సదుపాయాలు, లాజిస్టిక్ కొరత మూలంగా ఆరంభమైన ఏడాదిలోపే మూతబడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, విశేషప్రతిభ గల నిపు ణులంతా మెరుగైన ఉపాధి, పరిశోధనపేరుతో దేశం విడిచి పోవటంవల్ల కూడా దేశం భారీగా నష్టపోతోంది. ప్రభుత్వాలు మేలుకొని, యువత నైపుణ్యాల మీద దృష్టి సారించాలి.
-గోరంట్ల శివరామకృష్ణ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: