हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Workers Welfare : కార్మికుల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సుభాష్

Shravan
Workers Welfare : కార్మికుల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సుభాష్

విజయవాడ Workers Welfare : కార్మికుల భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కార్మికుల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య భీమా సేవల శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetty Subhash) అన్నారు. ఈఎస్ఐ వైద్యశాల ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ సుభాష్ ఆఫ్ ఇండియా సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన 2 అంబులెన్స్ లను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ ఈఎస్ఐ వైద్యశాలల్లో 500 ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అలాగే వైద్యశాలల్లో వైద్య పరికరాల కోనుగోలుకు అనుమతులు వచ్చాయన్నారు. ప్యాక్టరీల్లో జీరో ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే గతేడాది కరా ప్రమాదాలు చోటు చేసు కున్నాయని, వాటి నివా రణకు పలు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. కార్మికుల ఆరోగ్య భద్రపై దృష్టి సారించామని వారికి అవసరమైన సేవలను గంటలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు 24 తీసుకుంటున్నామని వివరించారు. సేవలను మరింత విసృత పరచడంలో భాగంగా ఎస్ బి ఐ సహకారంతో సీఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కొద్ద రోజుల క్రితం యూనియన్ బ్యాంక్ సహకారంతో రూ. 43 లక్షల (Rs. 43 lakh) విలువైన అంబులెన్స్ ను ఈఎస్ఐ వైద్యశాలకు అందించడం జరిగిందన్నారు. ఈ అంబులెన్స్ ల్లో వెంటిలేటర్, ఈసీజీ తదితర రోగికి అత్యవసర పరికరాలు ఏర్పాటు చేయడమైనదన్నారు.

Workers Welfare

కార్మికుల కోసం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రాష్ట్రంలో వైద్యశాలలు, 96 డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్లో రికార్డుల మూల్యాంకనం చేయడానికి పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు కల్పించడానికి, ప్యాక్టరీల్లో భద్రకు సంబంధించి విశ్వవిద్యాలయాల నుంచి సాంకేతిక సహకారం తీసుకునేందుకు జెఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ నెల 4 న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపురం, ఏపీ ప్రొడక్టవిటీ కౌన్సిల్ తో కూడా ఓప్పందాలు చేసుకున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. ఈ ఒప్పందాల్లో భాగంగా పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్నషిపు అవకాశం కల్పిస్తామన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/nabard-apgb-aqua-exchange-sign-agreement-for-technical-loan-facility-for-shrimp-farming/andhra-pradesh/529313/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870