గ్రామపంచాయతీలకు సర్పంచ్ నియామకాలు జరిగిపో యాయి. డిసెంబర్ 22న అధికారికంగా ప్రమాణస్వీకా రాలుచేసి గ్రామ నూతన పాలకుల కొలువుదీరారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 243డి ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించగా, దానిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నివిభాగాల్లో మహిళా రిజర్వేషన్ 50శాతానికి పెంచి అమలు చేస్తున్నారు. దీని వల్ల సగంమంది మహిళలు గ్రామపంచాయతీలకు నాయకత్వం వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 6వేలకుపైగా మహిళలు సర్పంచ్లుగా (Women as Sarpanchs) ఎన్నికయ్యారు. అందులో జనరల్ స్థానాలలో 2446, బీసీ మహిళల స్థానాలు 942, ఎస్సీ మహిళల స్థానాలు 908,ఎస్టీ మహిళలు 1434 స్థానాలు పొందగా, అందులో అత్యధికంగా నల్గొండజిల్లాలో 404 మహిళా సర్పంచ్ స్థానాలుండడం గమనార్హం. పూర్వం ఆడ వారంటే వంటింటికే పరిమితం, వారిపై చులకన భావన ఉండేది. అలాగే ఆడశిశువులను కనడానికి, చదివించడానికి శ్రద్ధ వహించేవారు కాదు. అలాంటి వివక్షత నుండి కాలక్ర మేణా వచ్చిన మార్పుల వలన నేడు మహిళలు అన్నిరంగా లలో పురుషులతో సమానంగా అవకాశాలు పొందుతున్నప్ప టికి ఇంకా అక్కడక్కడా కొంత వివక్షతకు గురవుతున్నారన డంలో నిజం లేకపోలేదు. ఆనాడు భారతీయ మెదటి మహి ళాఅధ్యాపకురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొదలుకొని, నేటి వాస్తవిక సమాజంలో ఎందరో మహమ ణుల కృషి ఫలితంగా నేడువారికంటూ ఒక స్థానాన్ని ఏర్ప రచుకోవడమే గాకుండా ‘మాకెవరుసాటి మాకు మేమేసాటి’ అనేలా మగవారుచేసే ప్రతిపనిని చేస్తూ నిరూపిస్తున్న తరుణం.
Read Also : http://Anjaw District: ఇండియాలో మొట్టమొదట సూర్యుడిని చూసేది ఈ ఊరి ప్రజలే

మహిళసత్తా
ఒక్క రంగంలో కాకుండా ప్రతిరంగంలోకి ప్రవేశించి మహిళసత్తా అంటే ఏంటోనని పలువురికి ఆదర్శంగా నిలు స్తున్న ఆదర్శమహిళలెందరో ఉన్నారు. అలాగే సాహిత్యరం గంలో సైతం ఎందరో మహిళలు ఎన్నో రచనలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందులోభాగంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న దాఖళాలున్నాయి. ఇవియే కాకుండా విభిన్నరంగాలలో మహిళామణులు తమ కంటూ ఒకస్థానాన్ని ఏర్పరచుకొని మేముసైతం అనిచెప్పే సందర్భంలో ప్రస్తుత మహిళలోకమున్నది. ప్రత్యేకంగా పాలకవర్గంలో మహిళామూర్తులు ఆదర్శవంతమైన పాలన గావించి తమ ధైర్యసాహసాలను చెప్పకనే చెప్పడం జరి గింది. అలాంటి సందర్భంలో గ్రామీణప్రాంతాలలో దానికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి అబద్దం లేదు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ల కారణంగా ఎన్నికైన మహిళా వార్డుమెంబర్లు, సర్పంచులు, (Women as Sarpanchs) రాజకీయ నాయ కులు అవకాశం రాకపోవడంతో వారిభార్యలను, తల్లులను ఎన్నికల బరిలో దిగబెట్టి, ఆయా స్థానాలను చేజిక్కించుకోవ డం జరిగింది. కానీ వారిని కేవలం సంతకాలకే పరిమితం చేసి, వారిస్థానాలలో భార్య చాటు భర్తలా అధికారాలను చెలా యించడం జరుగుతుందంటే మహిళలకు మగవారిచ్చే గౌర వం ఏపాటిదో తెలియకనే తెలుస్తుంది. కార్యాలయాలలో ఎన్నికకాబడిన మహిళామణులున్నా కూడా ఏదైనా అవసరం నిమిత్తం వెళ్లితే, ముందుగా వారిభర్తను లేదా కుమారుడిని కలిసి విషయంచెప్పి అనుమతి తీసుకుంటేగానీ పనికానీ పరిస్థితి దాపురిం చిందంటే అతిశ యోక్తిలేదు.
ఆడచాటు మగ పెత్తనం?
బయ టి ప్రపంచానికి మగవారికి సమానంగా గౌరవిస్తు న్నట్లు చట్టాలు చేసుకుంటూ, క్షేత్ర స్థాయిలో చేసేపని దేనికి సూచియోఅర్థంకానీ పరిస్థితి. ఎందరో ఆదర్శ మహిళలు పోరాడి, రాజ్యాంగపరంగా వారికంటూ స్థానాలుండాలని పోరాడితే ఇలాంటి అవకాశాలు పొందడం జరిగింది. కానీ చివరికి అధికార చెలాయింపు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వారికీ లేకపోవడమనేది బాధాకరం. ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబాలు సుఖసంతోషాలతో ఉన్నదంటే కారణం ఆ కుటుంబ బాధ్యతలను మహిళామణులు లేదా భార్యభర్తలి ద్దరు కలిసి చూసుకోవడ మనేది నగ్నసత్యం. అలాంటి తరు ణంలో పూర్తిగా నిర్ణయ బాధ్యతలు వారికే ఇస్తే గ్రామాన్ని సైతం బాగుపరుస్తారు కదా! ఎందుకీ ఈ ఆడచాటు మగ పెత్తనం? అనే అనుమానం కలగకమానదు. అంటే రాజ్యాంగ పరంగా వారికంటూ అవకాశాలిస్తూ, వాటిని మగవారు చేతు లోకి తీసుకోవడం సరైనపద్ధతేనా? ప్రభుత్వాలు వీటిపై దృష్టి కేంద్రీకరించి సరైనచర్యలు తీసుకోని, వారికీ ప్రత్యేక శిక్షణ లిస్తూ, స్వతహాగా నిర్ణయం తీసుకునేలా, వారి తరుపున మగపెత్తనం లేకుండే విధంగా చర్యలు
తీసుకోవల్సిన అవ సరం ఎంతైనా వున్నది. ఇలాచేయని యెడల స్థానిక సంస్థ లలో ఆడవారికి ప్రత్యేక రిజర్వేషన్స్ వలన ఎలాంటి ఫలితం లేదని గ్రహించాలి. కావున ఎన్నికలలో గెలిచిన మహిళలకు పూర్తిగా స్వేచ్ఛ ఉండేలా, వారిపై వారి కుటుంబ సభ్యుల నియంత్రణ లేకుండేలా, కార్యాలయాలలో ఆడచాటు మగ పెత్తనం ఉండకుండా చర్యలు తీసుకుంటూ మహిళలకు వచ్చిన రిజర్వేషన్స్ ను గౌరవిస్తూ, సహకరించే విధంగా ప్రభుత్వాలు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

స్వేచ్ఛనిస్తే రాణిస్తారు
ఇంటికి దీపం ఇల్లాలు’ అంటారు. ప్రస్తుతం అధికశాతం కుటుంబాలలో మహిళల నిర్ణయాలే శిరో ధార్యం. అలాంటి కుటుంబాలే అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నాయనడం సైతం జగమెరిగిన సత్యం. వారికి పూర్తి స్వేచ్చనిస్తే రుజువు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతెందుకు దేశా నికి ఇందిరాగాంధీ ప్రధానిగా పగ్గాలుచేపట్టి, ఒక మహిళా శక్తి ఏంటో నిరూపించలేదా? ప్రతిభా పాటిల్ దేశప్రథమ పౌరురాలు (రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తే, ప్రస్తుతం ద్రౌపదిముర్ము విధులు నిర్వహించడంలేదా? గతంలో సుష్మాస్వరాజ్ ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయ లేదా? నిర్మలా సీతారామన్ ప్రస్తుత దేశ ఆర్థికమంత్రిగా సేవలందిం చడం లేదా? గత మూడు పర్యాలుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కొనసాగుతుండగా, గతం లో సుచేతా కృపాలాని, షీలాదీక్షిత్, మాయావతి, జయ లలిత, వసుంధర రాజే, ఉమాభారతి, రబ్రీదేవి, ఆనందిబెన్ పటేల్ ఇలా మహిళామణులెందరో వివిధ రాష్ట్రాలకు ముఖ్య మంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా సేవలు చేయలేదా? చేస్తలేరా? అంతెందుకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సైతం సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా విధు లు నిర్వహిస్తున్నారు. అలాగే విభిన్నరంగాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ అగ్ర స్థానాలకు చేరుకున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలపట్ల మహిళామణులు దృష్టిసారించి, స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ పాలక రంగంలో రాణించినమాట వాస్తవంగాదా!కానీ గ్రామాలలోకి వచ్చేసరికి ఎక్కువశాతం వారినీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడమనేది దేనికి నిదర్శనమో అంతుపట్ట ని ప్రశ్నగా మిగిలిపోతుంది. పుట్టుకతోనే ఎవరు అన్నీ నేర్చు కోరు. క్రమంగా అర్థమవుతుంటాయి. వారికీ ఆ స్వేచ్ఛనిస్తే రాణిస్తారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. రాజ్యాం గం పరంగా ఎవరి హక్కులనుకాలరాయ కుండా చూసుకో వాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరిపై ఉన్నది.
-డా. పోలం సైదులు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: