ఆంధ్రప్రదేశ్‌ను భారీ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పరిశ్రమల విభాగం, CII సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు విశాఖపట్నంలో జరగనుంది. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించాలన్న ప్రభుత్వ ప్రధాన లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశీయ–అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ రంగ నిపుణులు పాల్గొనబోతుండటంతో వైజాగ్ మరోసారి పరిశ్రమల సంగమంగా మారబోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు–ఉద్యోగాలు–అభివృద్ధి అనే మూడు దిశల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
Telugu News: India: మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
ఈ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పలు దేశాల్లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సామర్థ్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లారు. టోక్యో, దుబాయ్, సింగపూర్, అమెరికా వంటి కేంద్రాల్లో ప్రధాన కంపెనీలతో సమావేశమై, ఏపీకి ఉన్న అనుకూల పరిస్థితులు, నైపుణ్య శక్తి, పోర్టు ఆధారిత అభివృద్ధి అవకాశాలు, భోగాపురం ఎయిర్‌పోర్టు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి అంశాలను వివరించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా పలువురు పెట్టుబడిదారులు వైజాగ్ సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించడం రాష్ట్రానికి పెద్ద ప్లస్‌గా మారింది. ఈ సందర్శనలన్నీ ప్రభుత్వ పెట్టుబడుల వ్యూహంలో కీలకంగా నిలిచాయి.

ఈ ఏడాది సదస్సు ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో పాటు ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్–2047’ అనే థీమ్‌తో నిర్వహించడం ప్రత్యేకత. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థిక వృద్ధికి ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని ప్రభుత్వం స్పష్టంగా రుజువు చేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఎనర్జీ, ఐటీ, ఇంట్రాస్ట్రక్చర్, అగ్రిటెక్, తయారీ రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధి మార్గంలో మలుపు తీసుకువచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/