సమాజంలో తరచుగా వినిపించే ప్రశ్నవిద్యార్థి ఎందుకు విఫలమయ్యాడు? పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చి నా, ఆశించిన ఫలితాలు రాకపోయినా, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయినా వెంటనే ఆ విద్యార్థినే తప్పుపట్టే ధోరణి మనలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నిజంగా విద్యార్థి వైఫ ల్యానికి విద్యార్థి ఒక్కడేబాధ్యుడా? లేక కుటుంబం, ఉపాధ్యా యులు, విద్యావ్యవస్థ, సమాజం అన్నీకలిసి ఈ వైఫల్యానికి కారణమవుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సి న అవసరం ఉంది. చదువుపై ఆసక్తి లేకపోవడం, క్రమ శిక్షణ లోపించడం, సమయాన్ని వృథా చేయడం, మొబైల్ ఫోన్లు-సోషల్ మీడియాకు బానిసకావడం వంటి కారణాలు కొంతవరకు విద్యార్థి (Students )వైఫల్యానికి దారితీస్తాయి. లక్ష్యనిర్దేశం లేకుండా చదవడం, కష్టపడాలనే తపన లేకపోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపుతాయి. అయితే ఇవన్నీ విద్యార్థిస్వయంగా ఏర్పరుచుకున్న లోపాలా? లేక అతడిని చుట్టు ముట్టిన పరిస్థితుల ఫలితమా అన్నది ఆలోచించాలి. విద్యార్థి ఎదుగుదలలో కుటుంబం కీలకపాత్ర పోషిస్తుంది. తల్లిదం డ్రుల ప్రోత్సాహం, అవగాహన,మార్గనిర్దేశం విద్యార్థి భవి ష్యత్తును నిర్దేశిస్తాయి. అయితే కొంత మంది తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై బలవంతంగా మోపుతారు. పిల్లల అభిరుచులు, సామర్ధ్యాలు గమనించకుండా ఒకే రకమైన కోర్సులు, ఒకే లక్ష్యాలను విధిస్తారు. మరికొందరు చదువుపై శ్రద్ధ చూపకుండా పూర్తిగా ఉపాధ్యాయులపై బాధ్యత నెట్టే స్తారు. ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా విద్యార్థి మనసుపై తీవ్ర ప్రభావంచూపి వైఫల్యానికి దారి తీస్తాయి. కాబట్టి విద్యార్థి (Students )వైఫల్యానికి కుటుంబం బాధ్యత కూడా గణనీయమే ఉపాధ్యాయుల పాత్రను విస్మరించలేం. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తిమాత్రమే కాదు, విద్యార్థి జీవితానికి మార్గదర్శి. అయితే నేటి విద్యావ్యవస్థ లో కొంతమంది ఉపాధ్యాయులు బోధనను కేవలం ఉద్యోగంగా మాత్రమే భావిస్తున్నారు.
Read Also : http://Google Gemini AI: ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

విద్యార్థుల మనోస్థితిని అర్థం చేసుకోకుండా, వ్యక్తిగత శ్రద్ధ చూపకుండాయాంత్రికంగా పాఠాలు పూర్తిచేస్తున్నారు. పరీక్షల మార్కులకే పరిమితమై, సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందించడంలో విఫలమవుతున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహిం చాల్సినచోట, నిరుత్సాహ పరిస్తే అది విద్యార్థి వైఫల్యానికి కారణమవుతుంది. విద్యా వ్యవస్థ కూడా విద్యార్థి వైఫల్యంలో ప్రధానపాత్రపోషిస్తుంది. మన విద్యావిధానం ఇప్పటికీ మార్కుల కేంద్రంగా కొనసాగుతోంది. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడమే విజ యంగా భావించే పరిస్థితినెలకొంది. విద్యార్థి ప్రతిభను, నైపుణ్యాలను, ఆసక్తులను గుర్తించడంలో వ్యవస్థ విఫలమవు తోంది. రాటుదేల్చే పద్ధతి, భారం మోపే పాఠ్యాంశాలు, ఒత్తిడిని పెంచే పరీక్షా విధానం విద్యార్థులను మానసికంగా బలహీనులను చేస్తోంది. కొంతమంది విద్యార్థులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక పూర్తిగా వెనుకబడిపోతున్నారు. ఇది విద్యార్థి తప్పుకంటే వ్యవస్థ వైఫల్యంగా భావించాలి. సమాజ ప్రభావం కూడా విద్యార్థి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజం విజయాన్ని ఒకే కొలమానంతో కొలుస్తోంది. డాక్టర్, ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగం. ఈ పరిమిత దృక్పథం విద్యార్థుల్లో అనవసరమైన పోటీని, ఒత్తిడిని పెంచుతోంది. వృత్తివిద్య, కళలు, క్రీడలు వంటి రంగాలను తక్కువగా చూడటం వల్ల అనేక మంది విద్యార్థులు తమ సహజ ప్రతిభను వెలికితీయలేకపో తున్నారు. సమాజం అంగీకారం లేకపోవడం వల్ల వారు విఫలులుగా ముద్ర వేయబడుతున్నారు. ఇక సాంకేతిక పరి జ్ఞానం విషయానికి వస్తే, అది విద్యార్థికి వరమా శాపమా అన్నది వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సరైన మార్గ నిర్దేశంలేకపోతే ఇంటర్నెట్, సోషల్ మీడియా విద్యార్థిని చదువు నుంచి దూరం చేస్తాయి. ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సిన అవ సరం ఉంది. అంతిమంగా చెప్పాలంటే, విద్యార్థివైఫల్యానికి ఒకరిని మాత్రమే బాధ్యుడిగా చూపడం సరికాదు. విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావ్యవస్థ, సమాజం అందరూ కలిసి బాధ్యత వహించాలి. విద్యార్థిని అర్థంచేసు కొని, అతనిసామర్థ్యాలకు అనుగుణంగా మార్గనిర్దేశం చేయ గలిగితే వైఫల్యం తగ్గుతుంది. తప్పులను చూపించడమే కాకుండా, సరిదిద్దే అవకాశాలు కల్పించాలి. అప్పుడు మా త్రమే విద్యార్థి నిజమైన విజయాన్ని సాధించగలడు. వైఫ ల్యం అంతిమం కాదు. అది ఒక పాఠం. ఆ పాఠాన్ని సమాజం మొత్తం కలిసి నేర్చుకున్నప్పుడే విద్యార్థి విజయవంతమైన పౌరుడిగా ఎదుగుతాడు.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: