“తల్లికి వందనం”పథకంపై (On the “Salute to Mother” project) వైసీపీ ప్రశ్నించడంపై మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలు తాము కొనసాగిస్తున్నామన్నారు. అలా అయితే తమను విమర్శించే హక్కు వైసీపీకి లేదని ఆయన తేల్చిచెప్పారు.లోకేశ్ (Lokesh) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ అయ్యాయి. ఇది “బాబు సూపర్ సిక్స్”లోని ప్రధాన హామీగా నిలిచింది.గత విద్యాశాఖ మంత్రికి విద్యా వ్యవస్థపై కనీస అవగాహన లేదని లోకేశ్ విమర్శించారు. యూడైస్ డేటాలో ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కలిపి తప్పుడు గణాంకాలు చూపించారన్నారు.
అర్హతలపై క్లారిటీ
తల్లికి వందనం పథకం కింద అన్ని అర్హతలు పూరించిన వారికి నిధులు అందుతాయని లోకేశ్ చెప్పారు. తల్లి లేనివారికి తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో, అనాథాశ్రమాల్లో ఉంటే కలెక్టర్ ద్వారా నిధులు జమ చేస్తామన్నారు.నిధుల జమలో ఏమైనా సమస్య ఉంటే జూన్ 26లోగా ‘మనమిత్ర’ వోట్సాప్ లేదా సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడమే ఎక్కువగా సమస్యలకి కారణమన్నారు.గత వైసీపీ ప్రభుత్వం “అమ్మఒడి” ద్వారా 42 లక్షల మందికి రూ.5,540 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అదే తమ ప్రభుత్వం 67 లక్షల మందికి రూ.8,745 కోట్లు ఇచ్చిందన్నారు. అంటే ఏడాదికి రూ.3,200 కోట్లు అదనంగా, ఐదేళ్లలో రూ.16,000 కోట్లు మించి వెచ్చిస్తామని స్పష్టం చేశారు.
విద్యా రంగానికి మద్దతు
పాఠశాలలు తెరిచిన తొలి రోజే 80% మంది విద్యార్థులకు స్కూల్ కిట్లు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన వారికి జూన్ 20లోగా పంపిణీ పూర్తవుతుందన్నారు.
ఇంటర్ విద్యార్థులకు కూడా కిట్లు పంపిణీ చేయడం, సన్నబియ్యం పంపిణీ మొదలుపెట్టడం, “వన్ క్లాస్-వన్ టీచర్” పథకం అమలు చేశామన్నారు.ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జూన్ 16 నాటికి పూర్తవుతుందని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలలపై నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఏడు నెలల్లో “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్” ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Also :Zomato : జొమాటోపై బెంగళూరు వాసి ఆగ్రహం