ఈ నెల 13వ తేదీన (బుధవారం) వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీనికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.అలాగే, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కూడా ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. వాతావరణంలో మార్పులు, ఆవర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా వాయవ్య బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అల్పపీడనం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి.

రానున్న రోజుల్లో వర్షాల తాకిడి ఎక్కువే
ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశముంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం రాష్ట్ర వాతావరణాన్ని ప్రభావితం చేయనుంది. దీనివల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండొచ్చు.విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో శుక్రవారం మాట్లాడారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయని వెల్లడించారు.
ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలకు అవకాశం
ఈ జిల్లాల్లో తక్కువ సమయంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుదాఘాతం ప్రమాదాల నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.ప్రధానంగా వర్ష ప్రభావం దక్షిణ, దక్షిణ-మధ్య ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంటుందని అంచనా. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాధారణంగా నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: అధికారుల సూచన
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. రైతులు, గిరిజన ప్రాంతాల ప్రజలు వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలి.ఇంకా రెండు మూడు రోజులు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా వేయడం, నీటి ప్రవాహాలు ఉన్న చోట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ attempt చేయకపోవడం మంచిది.
Read Also : China Provinces: వరదలకు 10మంది మృతి, 33 మంది గల్లంతు