Yanamala: రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగ సవరణ తప్ప మరే మార్గం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల(Yanamala) రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. నిజమైన సామాజిక న్యాయం దేశంలో అమలుకావాలంటే రాజ్యాంగ మార్పులు అవసరమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Dharmendra: ధర్మేంద్ర కు ప్రధాని మోదీ నివాళిలు

ముఖ్యంగా విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు
ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు కలసి విజ్ఞప్తి చేయాలని యనమల సూచించారు. సమాజం(society)లో కొనసాగుతున్న అసమానతలను తొలగించడంలో ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమని గుర్తుచేశారు. ముఖ్యంగా విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత పెంచితేనే పేదవర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ఈ రెండు కీలక విభాగాలను బలోపేతం చేస్తే మానవ వనరుల స్థాయి పెరుగుతుందని, తద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల మధ్యనున్న అసమానతలు తగ్గుతాయని యనమల చెప్పారు. బలహీన వర్గాల సబలీకరణ కోసం ప్రభుత్వాలు(Governments) ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: