45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
విజయవాడ : సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో కలుషిత నీటి(Welfare homes) ఘటనలు తరచూ జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. విధ్యార్థులకు సురక్షిత నీటిని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ సంక్షేమ వసతిగృహాలు సహా 49 ఎస్పీ గురుకులాలు, రెండు అంబేద్కర్ స్టడీ సర్కిళ్ళలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్చలు చేపట్టింది.
Read also: ముహూర్తాలు’లేని మార్గశిరం!

45 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఆదేశం: రూ.9.29 కోట్లు మంజూరు
ఇందుకు రూ.9.29 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఎస్సీ వసతి గృహానికి రూ.2 లక్షల చొప్పన మొత్తం 311 వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు విడుదల చేసింది. గురుకులాల్లో(Welfare homes) విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అధిక సామర్థ్యం గల ఆర్వో ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఒక్కో దానికి రూ.6లక్షల చొప్పున కేటాయించింది. 49 గురుకులాలు రెండు స్టడీ సర్కిళ్ళకు మొత్తం రూ.3.06 కోట్లు విడుదల చేసింది. వీటన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: