ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇటీవల మొంథా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రైతులు, వ్యవసాయ రంగం భారీగా దెబ్బతిన్నాయి. ఇంకా ఆ దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోకముందే… రాబోయే రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది..
Read Also: Polavaram Project: ‘పోలవరం’ను పరిశీలించిన కేంద్ర బృందం
నవంబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది నెమ్మదిగా పశ్చిమ- వాయువ్య దిశలో కదులుతూ, నవంబర్ 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.మరింత బలపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది.ఈ మార్పులతో వచ్చే కొన్ని రోజుల్లో తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారనుంది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం, నవంబర్ 27 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలు – ప్రకాశం, నెల్లూరు, తిరుపతి – అలాగే రాయలసీమ చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ప్రత్యేకించి భారీ వర్షాల రోజుల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.అత్యవసర సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్లు:1800 42 50101,112,1070, తెలంగాణలో కూడా నవంబర్ 23 నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నవంబర్ 21, 22 తేదీల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది.
అంతేకాకుండా, రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గురువారం పటాన్‌చెరు (9°C), మెదక్ (9.2°C), ఆదిలాబాద్ (10.4°C) వంటి ప్రాంతాల్లో తీవ్రమైన చలి నమోదైంది.
వచ్చే వారం వరుసగా భారీ వర్షాలు
వాతావరణ శాఖ ప్రకారం, అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత తెలంగాణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. నవంబర్ 23 నుంచి 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా.ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు తెలిపారు..
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: