తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: AP: ఈరోజు మెగా జాబ్ మేళా
కొంచెం తక్కువ
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర చలి మొదలయిందని.. హైదరాబాద్‌లో నేటి నుంచి చలి మొదలవుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రారంభమయ్యే చలి రాష్ట్రం మొత్తం విస్తరించి, మరోసారి గడ్డకట్టే చలి ఖాయమని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో మాత్రం కొంచెం తక్కువ చలి ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: