ప్రపంచంలో అణ్వాయుధ దేశాలను వేళ్ల మీద లెక్కించుకోవచ్చు. ఎవరికెన్ని ఆయుధాలున్నా ఆయా దేశాల ప్రాణాపాయ పరిస్థితుల్లోమాత్రమే వాటిని ఉపయోగించుకోవాలి. అయినా అణ్వాయుధ దేశాల మధ్య ఓ గౌరవప్రద ఒప్పందం ఉంటుంది. ఆ మధ్య రెండు అణ్వాయుధ దేశాలలో భారత్, పాక్ ల మధ్య వాటి ప్రయోగంతో యుద్ధం రాబోతోందని ఊహా గానాలున్న తరుణంలో తాను కలుగచేసుకుని వారి మధ్య యుద్ధోన్మాదాన్ని తగ్గించానని, యుద్ధాన్ని నివారించానని పదేపదే శ్వేతసౌధాధినేత ట్రంప్ప్రవచించే వారు. ఇప్పటికీ ఆయన ఆ పాటే పాడుతున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదనివాపోతూ అది ఎవరికో దక్కినందుకు ఆందోళన పడుతూ వగచినప్పుడు, ఆ నోబెల్ గ్రహీత మరియా మచాడో తనకొచ్చిన నోబెల్ బహుమతి పతా కాన్ని ఆయనకిచ్చి శాంతింప చేశారు. ఆ సందర్భంగా తానిక శాంతి వ్యాఖ్యాలు పలకనని, వివిధ దేశాల మధ్య శాంతితో తనకేమీ సంబంధం లేదని స్మశానవైరాగ్యం చెందారు. ఇంత జరిగాక తనవరకు వస్తే గానీ తగవు తెలియదన్న రీతిలో ఇరాన్పై యుద్ధం ప్రకటించి తన సేనల్ని కూడా ఆ దేశంపైకి వదిలారు. ఈ అంశంపై దూకుడు ప్రదర్శిస్తున్న ట్రంప్ అప్పుడప్పుడు సంయ మనం పాటిస్తున్నట్లు నటిస్తూనే తన యుద్ధ ప్రయత్నాలకు కారణాలు వెతుకుతున్నారు. ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే ఊరుకోమని, అమెరికా ఆంక్షలు పెడుతోంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ఎకనామిక్ ఫోరమ్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ లక్ష్యంగా హెచ్చరించారు. ఇరాన్ అణ్వా యుధాల తయారీని తాము సహించబోమని, అవసరమైతే సైనిక చర్యకు వెనకాడబోమని అన్నారు. ఆయనలా అన్నారో లేదో ఇలా అమెరికా నుంచి సేనలు ఇరాక్కు కదిలాయి. అంటే యుద్ధమేఘాలు (War clouds)ఏర్పడ్డాయన్న మాట, దక్షిణ చైనా సముద్రంలో నిలిచి ఉన్న అత్యాధునిక యుఎస్ఎస్ అబ్రహంలింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ను అమెరికా అరేబియన్ సముద్రం పర్షియా గల్ఫ్ దిశగా తరలించింది. ఎఫ్15ఈసైక్. ఈగల్ జెట్లు గగనతలంలోనే ఇంధనం నింపే కెసి135, ఎయిర్ క్రాప్ట్ లను సిద్దం చేసింది. ఇవన్నీ ట్రంప్ మస్తిష్కంలోని ఆలోచనల వెంబడి జరిగిన పరిణామాలే. మధ్యప్రాచ్యం లో యుద్ధమేఘాలు (War clouds)కమ్ముకున్నట్లే. అమెరికా యుద్ధానికి సన్నద్ధమైనట్లే. ఎదుర్కొనేందుకు ఇరాన్ సేనలు సిద్ధంగానే ఉన్నాయి. క్షిపణి దాడులను సమర్థంగాప్రతి ఘటించేం దుకు థాట్, పేట్రియాట్ వంటి శక్తివంతమైన యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ ను కూడా మోహరించారు. ఖతార్, ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాల్లో కూడా రక్షణ వ్యవస్థలను ప్రేరేపితం చేసే విధంగా అమెరికా పటిష్టపరచడం వంటి చర్యలు అక్కడి పరిస్థితులకు అద్దం పడ్తున్నాయి. ఇంతకుముందే గత జూన్ నెలలో అమెరికా ఇరాన్అ ణు కేంద్రాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. అప్పట్లో ఫోర్టో అణు కేంద్రంపై దాడులు జరిపి అమెరికా ఇరాన్ రహస్య అణ్వాయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంగానే 400 కిలోల మేరకు యురే నియం అదృశ్యమైంది. దాని ఆచూకీ ఇంతదాక అమెరికా తెలుసుకోలేకపోయింది. కానీ ఎక్కడో ఇరాన్ అణ్వాయుధ తయారీకి ముందడుగు వేస్తోందన్న సందేహాల నుంచి అమెరికా బయటపడ లేదు. అందుకే ఆ అనుమానాలతోనే ఇరాన్పై అమెరికా కక్ష కట్టినట్లు ప్రయత్నిస్తోంది. ఒకపక్క శాంతి ప్రవచనాలు, మరోపక్క నోబెల్ గుర్తించని శాంతి నాకెందుకు? అంటారు. తాజాగా ఆయన వైఖరి చూస్తే ఇరాన్ అంతు చూడకుండా వదిలేట్లు లేరు. అమెరికా యుద్ధ నౌకలు విమానాలు భారీస్థాయిలో పశ్చిమాసియా వైపు కదులుతున్నాయన్నది ముమ్మాటికీ ఖచ్చిత సమా చారమే. అమెరికాకు స్నేహహస్తమిచ్చే ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వంటిరక్షణ వ్యవస్థలన్నిటినీ ఒకే తాటిపైకి తెస్తోంది. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం తప్పనిసరి అయితే ప్రపంచ వాణిజ్యంలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిదేశాలు అటు ఇటూ పాలు పంచుకుంటాయి. కాగా ఇరాన్ నియంత్రణలోని హర్మూజ్ జలసంధి గుండా ప్రతిరోజూ 2 కోట్ల బ్యారెళ్ల మేరకు చమురు రవాణా అవుతుంటుంది. ఈ రెండు దేశాల మధ్య పొరపొచ్చాలు బాగా పెరిగిపోతే ఆ జలసంధిని మూసివేస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కూడా పొత్తు పొసగకపోవ డమూ అసలీ సమస్యకు ప్రధాన కారణం అయ్యుండొచ్చు. ఇటీవలనే గాజా, ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఆగింది. ట్రంప్ నేతృత్వంలోనే శాంతిస్థాపన జరిగింది. ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్ మీద దాడి చేసే పరిస్థితులు కనిపి స్తున్నాయి. అదే జరిగితే ఇజ్రాయెల్కు అండదండ అమె రికాయే. ఇదే ఆలోచనతో ముందు చూపుగా అమెరికా ఇజ్రాయెల్కు పేట్రియాట్-3 శ్రేణి క్షిపణులను సరఫరా చేసింది. గతంలోనే ఇజ్రాయెల్ను ఎదుర్కొవడానికి ఇరాన్ పటిష్ట ప్రణాళికల నేపథ్యంలో ఇజ్రాయెల్కు అమెరికా బాసటగా నిలిచింది. ఇరాన్పై సైనిక చర్య తీసుకునేట ప్పుడు ఆచితూచి వ్యవహరిస్తా రనుకున్న ట్రంప్ ఉన్న ట్టుండి దావోస్ నుంచి వాషింగ్టన్ తిరిగివెళ్తూ ఎయిర్ ఫోర్స్వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ యుద్ధ ప్రయత్నాలను వివరించారు. ఇరాన్లో ప్రజల తిరుగు బాటులో ఐదువేల మందిచనిపోయారని వార్తలు వస్తున్నా, మరిన్ని ప్రాణాలు పోకుండా అమెరికా హెచ్చరించిందన్న విషయం గురించి పూర్తి వివరాలు బయటపడితే తప్ప ఇరాన్ అమెరికాలు శాంతించే పరిస్థితిలేదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: