విజయనగరం : పూర్వాశ్రమంలో ఎదురైన అనుభవాల నుంచి తెలుగుదేశం పార్టీ(TDP) గుణపాఠాలు నేర్చుకోవడం లేదనిస్తుంది. పావలా వనికి ముప్పావలా ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది గానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితికి అనుగుణంగా ఆడుగులు వేయలేకపోతోంది. ఇందుకు ఇప్పటికే అనేకానేక సంఘటనలు ఆవిష్క్రతమయ్యాయి. ‘ప్రజలే దేవుళ్ళు- కార్యకర్తలే పునాది’ అనే నినాదం కేవలం సినిమా డైలాగ్ లాగానే మిగిలిపోయింది తప్పించి వాస్తవానికి ఎంతో దూరంగా ఉందనేది నిర్వివాదాంశం. ప్రస్తుత సో కాల్డ్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చాలామంది ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి’ అనే టైపులో ఇటు పిలిస్తే అటు, అటుపిలిస్తే ఇటు చూస్తూ ప్రజలు, క్యాడర్తో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారనేది కూడా నిత్యానుభవమే. తమ పరిస్థితి ఇలా తయారైందేంటి చెప్మా అని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నిర్వేదంతో బాధ పడుతూ ఓ
విజయనగరం జిల్లాలో కార్యాచరణ అంతంతమాత్రమే! గుణపాఠాలు నేర్చుకోని టిడిపి నేతలు! తేలని పార్టీ అధ్యక్షుని ఎంపిక పనీ లేక, ఓ పదవీ లేక, చేతికి చిల్లి గవ్వ కూడా వచ్చే అవకాశం రాక “ఎవడి గోల వాడిదే” అనే చందంగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ‘ డామిట్ మళ్ళీ కథ అడ్డం తిరిగింది’ అని నసుక్కుంటూ అంత్మథనానికి గురవుతున్నారు.
Read also: భాషాభ్యుదయం కోసం సంఘటితంగా కృషి చేయాలి

పార్టీ కార్యకర్తల్లో నిరాశ, అధినేతల వైఖరిపై అసహనం
పార్టీ ఆఫీసు ఊసే లేదు: జిల్లా పార్టీ ఆఫీసు మార్చేస్తున్నామంటూ ఆ మధ్య పార్టీ (TDP) నాయకులు నానా యాగీ చేశారు. పెళ్ళి ఊరేగింపుకెళ్ళినట్టు పదుల సంఖ్యలో నాయకులు డజనుకి పైగా కార్లు, బళ్ళేసుకుని ఊరి చివర జాగాలో ఫొటోలకి ఫోజులిచ్చి ‘అదిగో పులి అంటే.. ఇదిగో తోక అనే చందంగా అంతా ఆయిపోయింది. ఇక రేపో మాపో కొబ్బరికాయ కొట్టేసి సాధ్యమైనంత త్వర లోనే బిల్డింగ్ కూడా లేపేస్తామని ఊదరగొట్టారు. కానీ వాస్తవానికి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అధికారమూ ఉంది. అర్ధ బలం, అంగ బలం కూడా ఉంది. పైగా ఎమ్మెల్యేలు, సచివులు కూడా స్వంత పార్టీ వాళ్ళే. వీటన్నింటికీ మించి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి కుటుంబం కూడా తమ వంతు ఆర్ధిక సాయం చేస్తామని కూడా ప్రకటించింది. ఇంతటి నేప థ్యంలో కూడా పార్టీ నిర్మాణం అనేది ఆమడ దూరంలోనే ఉంది. కొత్త ఆఫీసు నిర్మాణానికి ఓ రాయి వేద్దామనే ప్రయత్నం కూడా మరి ఏ సైంథవుడు అడ్డుపడు తున్నాడో గానీ ఒక అడుగు ముందుకి-నాలుగడుగులు వెనక్కి అనే చందంగానే ఉంది. ఎందుకూ, ఏంటి అనడిగితే కనీసం చెప్పగలిగే పరిస్థితి కూడా లేదు. నిన్న గాక మొన్న పార్టీకి చెందిన ఓ సీనియర్ప్రస్తుతం పార్టీ కార్యాలయంగా ఉన్న అశోక్ కాకుండా బంగ్లాలో గజవతి అతిథిగృహంలో ప్రెస్మిట్ పెట్టారు. జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కూడా అధిష్టానం ఏదీ తేల్చకుండా నాన్చుడి ధోరణినే అవలంభిస్తోంది.
అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చెయ్యాలనే దానిపై అధినేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాకుండా మల్లగుల్లాలు పడుతున్నారు. మార్చే ఉద్దేశ్యం మాత్రం ఉన్నట్టు కనిపిస్తోంది.
కాబట్టే ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలు సుకున్నారు. ఇంటర్పోల్ తరహాలో ఇన్వెస్టిగేషన్(Investigation) కూడా పూర్తయింది. ఊరూ వాడా అందర్నీ కెలికేసి, అందర్నీ అడిగేసిన తర్వాత కూడా ఏదీ చెప్పకుండా, ఏమీ తేల్చకుండా ఇంకా నానుస్తుండడం క్యాడర్తో పాటు ఆశావహుల్ని కూడా విసిగిస్తోంది. అయితే వారు ఈ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎందుకూ అంటే మున్ముందు స్థానిక సమరం ఉంది కాబట్టి. స్థానిక ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన సత్తాతో పాటు రూక ఉండడమే కాకుండా చేతి చమురు వదిలించుకునే తెగింపు కూడా ఉండడం, ఇద్దరు మాజీ మంత్రులు (కిమిడి కళా వెంకట్రావు, కోండ్రు మురళి), ప్రస్తుత మంత్రి (కొండపల్లి శ్రీనివాస్), ఇద్దరు రాజ వంశీయులు (విజయ నగరం అదితి గజపతి, బొబ్బిలి బేబీనాయన), తాజా ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలో కాళ్ళూ చేతులూ కొంకర్లు తిరిగిపోయిన సీనియర్ల తల్లో నాలుకలా ఉంటూ జిల్లాలో పార్టీల పట్లు, నేతల సిగపట్లు, రాజకీయ విన్యాసాలు తెలిసిన వ్యక్తి కోసం అధినేతలు అంజనం వేసి వెతుకుతున్నారట. ఈ నేపథ్యం లోనే డిలే అవుతోందని పార్టీలో డిబేట్ జరుగుతోంది.
వినాయక వ్రత కల్పమా?
పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం వినాయక వృత కల్పం కథని గుర్తు చేస్తోంది. అధ్యక్ష పదవి రేస్లో ఉన్న వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు లాబీయింగ్ చేసుకుం టున్నారట. ఓ కరణం పొంగూరు నారాయణ చుట్టూ కాళ్ళకి చెప్పుల రిగేలా తిరుగుతున్నాడని, మరో మునసబు పూర్వా శ్రమంలో ఉన్న పరిచయంతో అధినేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఆ ఇద్దరి చుట్టూ గింగిరాలు తిరుగుతున్నాడని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో ఆశావ హుడు అక్కడో ఎక్కడో ఇంకెక్కడో ఎందుకను కున్నాడో ఏమో గానీ వినాయక వ్రత కల్పం కథలోని కుమారస్వామి- వినాయకుడి ఎపిసోడ్ని మననం చేసుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీకి కేంద్ర బిందువు, పార్టీలో అధికారానికి అసలు సిసలు నిర్వచనంగా చెప్పుకునే నిఖార్సయిన వ్యక్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. కొసమె రుపు ఏంటంటే, ఇంత జరుగుతోందని తెలిసినా హై కమాండ్ నుంచి ఉలుకూ పలుకూ లేకపో వడం. హై కమాండ్ మొదటి నుంచి అనుసరిస్తున్నదే అయినా ఈ నాన్చుడి ధోరణి పథ్యంలో ఆశావహులతో పాటు క్యాడ క్యాడర్ కూడా ‘అన్నా… ఎవరే అతగాడు’ అని కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ నిరీక్షిస్తున్నారు.. పార్టీ ఆఫీసుని ఇప్పటికిప్పుడు మార్చాలని గానీ మారిస్తే అద్భుతాలేవో జరిగిపోతాయని గానీ ఎవరూ అనడం లేదు.. అనరు కూడా. అలాగే అధ్యక్షుడి ఎంపికలో కూడా సేమ్ డైలాగ్ రిపీట్. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను అనుసరిస్తూ ఎప్పుడు చెయ్యాల్సిన పని అప్పుడు చేస్తేనే బాగుంటుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: