Vizag Data Center: విశాఖపట్నం త్వరలో అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా మారబోతోంది. గూగుల్ సంస్థ సుమారు రూ. 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఇక్కడ మెగా డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. ఇది కేవలం సమాచార నిధి మాత్రమే కాదు, వివిధ కంపెనీలకు ఏఐ ఆధారిత సేవలు అందించే గ్లోబల్ సెంటర్. సముద్ర గర్భం నుంచి వచ్చే ఇంటర్నేషనల్ సబ్‌సీ కేబుల్ వ్యవస్థతో విశాఖ ఆసియా దేశాలకు కీలక ద్వారంగా మారుతుంది.
Read also: Jio New Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 459 ప్లాన్‌తో 18 నెలల గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

Vizag Data Center: మూడు ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్లు
గూగుల్ తన కార్యకలాపాలను విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రధాన ప్రాంతాల్లో విస్తరిస్తోంది. ప్రభుత్వం తర్లువాడ, అడవివరం, రాంబిల్లి వద్ద మొత్తం 600 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులో ఆదానీ గ్రూప్ మౌలిక సదుపాయాల భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 2028 నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా గూగుల్ పని చేస్తోంది. గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల చూపు విశాఖ వైపు మళ్లుతుంది.
లక్షలాది ఉద్యోగాలతో కొత్త ఎకోసిస్టమ్
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 1.88 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. డేటా సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే నిర్మాణ సమయంలో సివిల్, ఎలక్ట్రికల్ రంగాల్లో మరో 60 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. గూగుల్ రాకతో రిలయన్స్ వంటి మరిన్ని సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్టార్టప్‌లు, రీసెర్చ్ ల్యాబ్‌లు పెరిగి నగరం మొత్తం టెక్నాలజీ హబ్‌గా సరికొత్త రూపం దాల్చుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: