Jio New Plan: జియో బంపర్ ఆఫర్.. రూ. 459 ప్లాన్‌తో 18 నెలల గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

Follow Us: Google News Daily Hunt
Jio 459 Plan Google Gemini Pro Offer
Jio 459 Plan Google Gemini Pro Offer
FONT SIZE
GET APP

Jio New Plan: రిలయన్స్ జియో యువతతో పాటు గేమర్ల కోసం ఒక స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. రూ. 459 ధరతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు అదనంగా మరో 5 జీబీ డేటా పొందవచ్చు. 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉండే వారికి అపరిమిత డేటా సదుపాయం కూడా ఉంది. నిరంతరం సోషల్ మీడియా, స్ట్రీమింగ్ వాడే వారికి ఇది సరైన ఛాయిస్.

Read also: Instagram Instants: ఇన్‌స్టాంట్స్ యాప్‌ను లాంచ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

Jio 459 Plan Google Gemini Pro Offer
Jio 459 Plan Google Gemini Pro Offer

Jio New Plan: ఉచితంగా గూగుల్ జెమిని ప్రో యాక్సెస్

ఈ ప్లాన్ లో ఉన్న అతిపెద్ద హైలైట్ గూగుల్ జెమిని ప్రో సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా రావడం. ఏకంగా 18 నెలల పాటు ఏఐ టూల్స్ వాడుకునే అవకాశం కల్పించారు. దీనితో పాటు భారీగా 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా యూజర్లకు సొంతం అవుతుంది. ఈ ఆఫర్ విలువ దాదాపు రూ. 35,100 ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇష్టపడే వారికి ఈ డీల్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.

ఇతర క్రేజీ డిజిటల్ సబ్‍స్క్రిప్షన్లు

డేటాతో పాటు వినోదం కోసం కూడా జియో అదిరిపోయే బెనిఫిట్స్ జోడించింది. ఇందులో మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు స్నాప్‌చాట్ ప్లస్, జియో గేమ్స్, ఫ్యాన్‌కోడ్ వంటి యాప్స్ యాక్సెస్ కూడా పొందవచ్చు. అదనంగా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ డిజిటల్ సేవలు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు