हिन्दी | Epaper

Viveka Murder Case: సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Pooja
Viveka Murder Case: సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Viveka Murder Case: ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమంటూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

Read Also :Crime : ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

Viveka Murder Case
Viveka Murder Case: Sunitha Reddy faces hurdles in Supreme Court

తదుపరి విచారణ అవసరం లేదు – సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

ఇప్పటికే ఈ విచారణకు సంబంధించి మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశామని, దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, సునీతా రెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసులో సీబీఐ తన దర్యాప్తును ముగించినట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870