ఏపీలోని వైజాగ్ లో గూగుల్ డేటా (Google data) సెంటర్ రాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక గిగా వాట్ ఏఐ డేటా సెంటర్ ను పెట్టే దిశగా ఒప్పందాలు కుదుర్చుకుంది.
Read Also: Bullion Market: తగ్గిన బంగారం, వెండి ధరలు

ప్రభుత్వంతో పలు ఒప్పందాలు
విశాఖపట్నంలో (Vishaka summit) సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో రకరకాల కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ఏపీలో భారీ ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీలో ఏఐ డేటా సెంటర్ పాటు సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో (Chandrababu) జరిపిన భేటీలో ఈ విషయాలు వెల్లడించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్లో అడ్విన్స్ డ్ జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్ లు అమర్చనున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న రిలయన్స్ గిగావాట్-ఏఐ డేటా సెంటర్ కు అనుబంధంగా దీన్ని నిర్మించనున్నారు. ఈ రెండు డేటా సెంటర్లకై నిలయన్స్ సుమారు రూ. లక్షకోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం.
యువతకు భారీ ఉపాధి అవకాశాలు
భారీ మొత్తంలో పెట్టుబడులు రావడంతో దీనికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 400లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకుంది. సుమారు మూడులక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి రానున్నట్టు తెలుస్తోంది. వీటికి బ్రూక్ ఫీల్డ్ ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి, నీన్యూ ద్వారా రూ.82 వేలకోట్ల పెట్టుబడి, ఎస్ ఏఈఎల్ పరిశ్రమ నుంచి రూ.22వేల కోట్ల పెట్టుబడి, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా సుమారు లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: