ఏపీ: విశాఖపట్నం(Visakhapatnam) రైల్వే స్టేషన్‌లో నకిలీ కరెన్సీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. విశాఖ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ నాయుడు నేతృత్వంలో రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతా తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు యువకులు నకిలీ నోట్లతో పట్టుబడ్డారు.
Read Also: Smart phone: Vivo V70 సిరీస్‌లో కొత్త ఫోన్.. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో

పోలీసుల సమాచారం ప్రకారం
పోలీసుల సమాచారం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి సునీల్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీశ్ కుమార్ వద్ద రూ.200 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నోట్ల(Fake Currency) మొత్తం విలువ సుమారు రూ.3.32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నకిలీ నోట్లను ఎక్కడి నుంచి తెచ్చారు, వాటిని ఎక్కడ వినియోగించాలన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తూ, సంబంధిత నెట్వర్క్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: