రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(rains) కారణంగా పాములు ఇళ్లలోకి వస్తుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ స్థానికంగా కలకలం సృష్టించింది. ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్‌లో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక ఇంటి ముందున్న మురుగు కాలువలో కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
Read also: Montha Cyclone: మొంథా తుఫాన్.. ఏపీ స్కూళ్లకు 3 రోజులు సెలవులు

కాలువలో కొండచిలువ: యువకుల ధైర్యం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ కొండచిలువ క్రాంతినగర్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి ముందున్న కాలువలో భారీ కొండచిలువను గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, వెంటనే కొందరు యువకులు ధైర్యం చేసి, దానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా, సురక్షితంగా పట్టుకున్నారు.
అటవీ ప్రాంతంలో విడుదల
యువకులు పట్టుకున్న కొండచిలువను బంధించి, సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షాకాలంలో పాములు, ఇతర విష కీటకాలు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: