కేంద్ర ప్రభుత్వం MGNREGA (మహాత్మా గాంధీ జార్నీ ఎంబ్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్)లో కీలక మార్పులు చేసింది. ఈ పథకం ఇప్పుడు “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VBGRAAM) పేరుతో అమలు కాబోతోంది. ఆప్రిల్ 2026 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ప్రధాన మార్పులలో పని దినాలు 100 నుంచి 125 రోజులు పెరగడం, కేంద్ర-రాష్ట్ర భాజన నిష్పత్తి 90:10 నుండి 60:40 కి మార్చడం, వేతనాల్లో ఆలస్యమైతే పరిహారం, ఖరీఫ్ సీజన్లో 2 నెలల విరామం వంటి అంశాలు ఉన్నాయి. గ్రామస్థాయి అవగాహన కోసం జనవరి 5 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు.
Read also: International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

- పనికి అర్హులైన వారికి 14 రోజుల్లో ఉపాధి కల్పించడం.
- ఆలస్యమైన వేతనానికి పరిహారం చెల్లించటం.
- గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం: సౌకర్యాలు, జీవనోపాధులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు.
- కొత్తగా 266 పల్లెలలో మురుగు కాలువలు, స్కూల్ & అంగన్వాడీ భవనాలు, పంచాయతీ ఆఫీసులు, సీసీ రోడ్లు నిర్మాణం.
- వ్యక్తిగత & సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు నిధులు మంజూరు.
- బీడు, బంజరు భూముల్లో పండ్ల తోటలు, మొక్కల పెంపకం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: