
Viral Video: తుని–నర్సీపట్నం మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు(RTC BUS)లో సీటు విషయమై చిన్నపాటి తగువుతో ప్రారంభమైన సంఘటన పెద్ద గొడవగా మారింది. ఓ మహిళ, సహ ప్రయాణికుడిపై ఆగ్రహంతో దూకి, అతని జుట్టు పట్టుకుని దాడి చేసింది.
Read Also: AP: నిందితులను కఠినంగా శిక్షించండి..మంత్రి అనిత
సమాచారం ప్రకారం, కొంతమంది మహిళలు ముందుగా ఒక సీటును కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసుకున్నారు. ఇది గుర్తించని మరొక ప్రయాణికుడు ఆ సీటులో కూర్చోవడంతో వివాదం మొదలైంది. “మేము సీటు పెట్టుకున్నాం, ఎలా కూర్చుంటావు?” అంటూ ఆ మహిళ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటల యుద్ధం తీవ్రత పెరగడంతో ఆమె అదుపు కోల్పోయి, నేరుగా అతడిపై దాడి చేసింది. ఈ దృశ్యాన్ని బస్సులోని ఇతర ప్రయాణికులు ఆశ్చర్యంగా చూశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత బస్సుల్లో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో సీట్ల కోసం తరచూ ఇలాంటి తగువులు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: