శ్రీకాళహస్తి Vinayaka : లోక కళ్యాణార్థం ప్రతి ఏడాది ఇక్కడి బేరివారి మండపం వద్ద నిర్వహించే వినాయక చవితి (Ganesha Chavithi) బ్రహ్మోత్సవాల్లో భాగంగా వినాయక హోమాలు సోమవారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ కోలా ఆనంద్ కుమార్ సారధ్యంలో ఇక్కడ భారీ ఎత్తున నవగ్రహ హోమాల్ని ఏర్పాటు చేశారు. 1994 నుంచి ఇక్కడి బేరివారి మండపం వద్ద హోమాలు నిర్వహించటం ఆనవాయితి. పంటలకు నిలయమైన జిల్లాలోని తూర్పు మండలాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పండాలని గాదులు నిండాలని, ప్రజలు అభివృద్ధి పథంలో నడవాలని హోమాలు నిర్వ హించినట్లు స్థానిక శాసన సభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, కోలా ఆనంద్ కుమార్ వివరించారు. ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం నుంచి బేరి వారి మండపం వద్ద భారీ ఎత్తున రెండు హోమ గుండాలను (Homa Gundalan) ఏర్పాటు చేసి వేదపండితులు పర్యవేక్షణలో ప్రత్యేకంగా రప్పించిన వేదపండితుల వేదఘోషతో పట్టణం దద్దరిల్లింది. హోమాల పొగతో పునీతమైంది. ఈ ప్రాంతాల్లో ఓ వైపు వర్షాభావం మరో వైపు రైతులకు గిట్టుబాటు ధరల్లేక తల్లడిలుతున్నారు. ఈ పరిస్థితిల్లో ప్రకృతిని పూజించటమే శరణ్యంగా హోమాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా వర్షాల కోసం శ్రీకాళహస్తీశ్వ రాలయంలో వరుణ జపం నిర్వహించటం ఆనవాయితి. సాంప్రదాయబద్ధంగా ఈ జపాన్ని నిర్వహించటం మృత్యుంజయ ఆలయం వద్ద అభిషేకం నిర్వహిస్తే వర్షాలుసమృద్ధిగా కురుస్తాయనే నమ్మకం ఈ ప్రాంతాల్లో ఉంది.
సోమవారం పట్టణ నడిబొడ్డులోని బేరివారి మండపం వద్ద వినాయక హోమాల్ని నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు జరిపి వినాయకుని ప్రార్థించారు. రాష్ట్ర బిజెపి నాయకుడు కోలా ఆనంద్ సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు బిజెపి నాయకులు కార్యకర్తలతో పాటు కూటమి నాయకులు సహాకరించారు. పట్టణ ప్రముఖులు హాజరై వినాయకుని ప్రార్థించారు. ఉదయం నుంచి హోమాలు నిర్వహించి మధ్యాహ్నం పూర్ణాహుతి గావించారు. నిలువెత్తు వినాయకునికి పూజలు జరిపారు.

వినాయకోత్సవం సందడి: సహపంక్తి భోజనాలు, కట్టుదిట్టమైన భద్రత
ఈ కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యుడు ఎస్ సివి నాయుడు. తెలుగుదేశం నాయకులు విజయకుమార్, దుర్గా ప్రసాద్ బిజెపి నాయకులు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. వినాయక హోమాల సందర్బంగా బేరివారి మండపం వద్ద కోలా ఆనంద్ సారథ్యంలో భారీ ఎత్తున సహాపంక్తి భోజనాల్ని ఏర్పాటు చేశారు. వేలాది మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ను మధ్యాహ్నం వరకు విఎంసి సర్కిల్ నుంచి అనుమతించలేదు.
ట్రాఫిక్ను క్రమబద్ధీకరించటంలో పట్టణ సిఐడి.గోపి. ట్రాపిక్ నిర్వాహాకులు వారి సహాచరులు పర్యవేక్షించారు. పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రతిరోజూ అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 150 చోట్ల నిమజ్జనం కార్యక్రమాలు జరిపారు.
తెలుగు గంగ కాలువలో నిమజ్జనానికి సంబంధించి సిఐలు నాగార్జున్రెడ్డి, తిమ్మయ్య, డి. గోపిలు ప్రణాళికా బద్దగా వ్యవహారించారు.
శ్రీకాళహస్తిలో వినాయక హోమాలు ఎందుకు నిర్వహిస్తారు?
శ్రీకాళహస్తిలో ప్రతి ఏడాది బేరివారి మండపం వద్ద వినాయక చవితి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమాలు నిర్వహించడం ఆనవాయితి. వర్షాభావం నివారణ, పంటల సమృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం వేదపండితుల పర్యవేక్షణలో ఈ హోమాలు జరుగుతాయి.
ఈ సంవత్సరం వినాయక హోమాల ప్రత్యేకత ఏమిటి?
ఈ సంవత్సరం రెండు హోమగుండాలతో భారీ ఎత్తున హోమాలు నిర్వహించారు. రాష్ట్ర, స్థానిక నాయకులు, ప్రముఖులు హాజరై వినాయకుని పూజలు చేశారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :