Vijayawada : విజయవాడలో దసరా వేడుకలను మైసూర్ తరహాలో (Mysore style) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో హెలీకాఫ్టర్ రైడ్, గ్యాస్ ఎయిర్ బెలూన్స్, ఎగ్జిబిషన్, జలక్రీడలు, సినీ, సాంస్కృతిక ప్రదర్శనలు 11 రోజుల పాటు రోజూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సంబరాలు విజయవాడ ఉత్సవ్ పేరుతో జరు గుతాయి. విజయవాడకు వచ్చే ప్రతి ఒక్కరూ కనీసం రెండు రోజులుండి, ఈ ఉత్సవాలను తిలకించి వెళ్లేలా వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్మెంట్ పార్కులు, జల క్రీడలు, హెలీకాఫ్టర్రెడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. దసరా అనగానే విజయవాడకు కచ్చితంగా వెళ్లాలనేలా వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ చూడనంత గొప్ప విద్యుత్తు దీపాలంకరణలతో నగరాన్ని ధగధగలాడించనున్నారు.
దసరా ఉత్సవాల కోసం విజయవాడకు ఏటా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవిదేశాల నుంచి 12-15 లక్షల మంది వస్తుంటారు. వీరు కనకదుర్గమ్మను దర్శించుకొని వెళ్లడం తప్ప మరే ఆకర్షణ లేదు. అందుకే ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాలతో మిళితం చేస్తూ విజయవాడ ఉత్సవ్ను నిర్వహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలు కార్నివాల్ తరహా లో జరుగుతాయి. పున్నమిఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్ల పూడిలో ఎగ్జిబిషన్ మైదానాల్లో అంతర్జాతీయ స్థాయిలో కార్నివాల్ తరహాలో వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వినూత్న రీతిలో దుకాణ సముదాయాల స్టాళ్లు, జలక్రీడలు, దాండియా నృత్యాలు, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, పిల్లలకు ప్రత్యేకంగా క్రీడాజోన్లు పెడతారు. రోజూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ గొల్లపూడిలో 39 ఎకరాల్లో ఎగ్జిబిషన్ మైదానం పెట్టి వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 11 రోజులు ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్తో కార్యక్రమాలు ఆరంభం కాబోతున్నాయి.

విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకూ సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ దసరాలకు హెలీకాప్టర్ రైడ్, గ్యాస్ ఎయిర్ బెలూన్స్లో నింగిలోకి వెళ్లే అనుభూతిని కూడా విజయవాడ వాసులు, పర్యాటకులు పొందొచ్చు. ఇవేకాక నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ పిల్లలు ఆడుకునేలా క్రీడాపరికరాలు పెట్టనున్నారు. దసరా వస్తోందంటే చాలూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. తెలుగు ప్రజలంతా “అమ్మలగన్న అమ్మ మము కన్నతల్లి మాతల్లి దుర్గమ్మ” అని నోరారా విజయవాడ కనకదుర్గమ్మను పిలుచుకుంటారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గాదేవికి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈసారి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్ధవంతంగా వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో పని చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా దేవి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఏం ప్రత్యేకం?
ఈ సంవత్సరం దసరా ఉత్సవాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించనున్నారు.
ఉత్సవాల సమయంలో భక్తులకు ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు?
భక్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉన్న దుర్గా దేవి మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు క్రీడాపరికరాలు, రవాణా సౌకర్యాలు వంటి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :