ఇద్దరు నిందితుల అరెస్ట్ విజయవాడ Vijayawada : తన భార్య తనను వదిలి వెళ్ళడానికి కారణ మైందనే కారణంతో తన పిన్నిని హత్య చేసినట్లుగా నమోదైన కేసులో సిసి కెమేరాల CC Camera ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్న ఉదంతమిది. సిపి రాజశేఖరబాబు తలిపిన వివరాల ప్రకారం గొల్లపూడి లోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో రెండు చేతులు, రెండు కాళ్ళు, తల లేని కేవలం ఒక మొండెం భాగం మాత్రమే ఉన్న మహిళ మృతదేహం ఉందనే సమాచారంపై భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సిపి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ ఏడిసిపి గుణ్ణం రామకృష్ణ, ఏసిపి దుర్గారావుల పర్యవేక్షణలో సిఐ ఉమామహేశ్వం రావు అథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి చుట్టుపక్కల విచారించారు.
Crime: అత్తతో అక్రమ సంబంధం.. వారికీ భార్య అడ్డుగా వస్తుందనే కోపంతో హత్య

Vijayawada Murder
ఈ నేపథ్యంలో పొత్తూరి విజయలక్ష్మి (70) చిట్టినగర్ లోని సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపం వద్దకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని వచ్చిన సమాచారం మేరకు అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన సిసి కెమేరాలను పరిశీలించి సదరు మహిళను ఒక వ్యక్తి బైక్ పై తీసుకెళ్ళినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి సమీపం లోని సీసీ కెమేరా పుటేజి పరిశీలించగా మృతురాలిని గత నెల 30న సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి లోపలికి తీసుకువెళ్ళినట్లు అప్పటి నుండి మృతురాలు తిరిగిరానట్లు తర్వాత నిందితులైన వంకదార హనుమాన్ జి.సుబ్రహ్మణ్యం, అతని కుమారుడు వంకధార లక్ష్మీ నరసింహస్వామిలు పలుమార్లు ఇంటి నుండి బయటకు బ్యాగులతో బయటకు వచ్చి బండిపై వెళ్ళినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: