Chandrababu Naidu : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సాంప్రదాయ తేనీటి విందుకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు ఆత్మీయంగా స్వాగతించారు. పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని ఆలపించడంతో వేడుక ప్రారంభమైంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి (Chandrababu Naidu) వేదికపై నుంచి కిందకు వచ్చి ఇతర అతిథులతో కలిసిపోయారు. స్వాతంత్య్ర సమరయోధులతో ముచ్చటిస్తూ వారి అనుభవాలను తెలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, క్రీడాకారులతో నేతలు ఆత్మీయంగా పలకరించడంతో లోక్ భవన్ ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణంతో నిండిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: