రు.500 టికెట్టు దర్శనం రద్దు
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారిని కార్తీకమాసం(Kartik month) చివరిరోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో (Vijayawada)నవంబర్ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2.30 వరకు రు.500 టికెట్ నిలిపివేస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా అందరికి బంగారు వాకిలి నుండి మాత్రమే దర్శనం వుంటుందన్నారు. భవానీ దీక్షల విరమణలకు వచ్చే భక్తులకు అందించాల్సిన ఏర్పాట్లకోసం ఇఓ, చైర్మన్లు క్షేత్రస్థాయిలో గురు వారం పరిశీలించారు.
Read also: బీహార్ ఫలితాలు..తేజస్వీకి మళ్లీ దక్కని CM కుర్చీ

క్షేత్రస్థాయిలో భక్తుల ఏర్పాట్లపై పరిశీలనలు
పలు అబివృద్ధి పనులు, నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇఓ వికె శీనా నాయక్, చైర్మన్ రాధా కృష్ణలకు డిప్యూటి ఇంజనీర్ అశోక్ కుమార్ పనుల పురోగతి వివరించారు. మహామండపంలో(Vijayawada) అధికారులనుద్దేశించి సమావేశంలో ప్రసంగిస్తూ ఇరు ముడుల పాయింట్లు, టాయిలెట్లు, కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, ఎగ్జిట్పాయింట్లు, క్యూలైన్లు ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: