విజయవాడ నగరాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసిన సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ (Annapurna Theatre) సమీపంలో ఇద్దరు యువకులను దారుణంగా హతమార్చిన ఘటన నగర ప్రజల్లో భయాందోళనకు గురిచేసింది. మృతులు విజయనగరం జిల్లాకు చెందినవారు కాగా, వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం విజయవాడకు వచ్చారు. స్థానికంగా అద్దె గది (Rented room) లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి పొడిచి పరారైనట్లు సమాచారం. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

స్వాధీనం
స్థానికుల ద్వారా ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ రౌడీషీటర్ (Rowdy sheeter) ఆ ఇద్దరు యువకులను కత్తితో పొడిచి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నగరంలోని శాంతిభద్రతలపై పెద్ద ప్రశ్నలు తెరమీదకు తీసుకొచ్చింది. నగర కేంద్రంలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మద్యం దొరికే ప్రాంతాల్లో నిఘా పెంచాలని, నేరపూరిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ ఎందుకు ప్రసిద్ధి చెందింది?
విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలో వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా విస్తరించి ఉంది. “ఆంధ్రప్రదేశ్ హృదయం”గా పిలవబడే ఈ నగరం పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
విజయవాడలో ప్రత్యేకమైన ఆహారం ఏమిటి?
విజయవాడ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఆహారాలలో మైసూరు బజ్జి,పునుగులు ఎంతో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP High Court: ఏబీ వెంకటేశ్వరావుకు హైకోర్టులో భారీ ఊరట