మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu).. ఉచిత పథకాలపై మరోసారి కామెంట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, యూపీలలో అమలవుతున్న ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు. ఈ పథకాల వల్ల ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. పని చేసే శక్తి ఉన్నవారిని కూడా ఉచితాలు పాడుచేస్తున్నాయని, వెంటనే వీటిని ఆపాలని గుంటూరు పర్యటనలో కోరారు.
Read also: AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్
విద్య, వైద్యం మినహా ఇతర ఉచితాలను ఆపివేయాలి
విద్య, వైద్యం మినహా ఇతర ఉచితాలను నిలిపివేయాలని చెప్పారు. ఉచిత పథకాలను తక్షణమే ఆపేస్తే, రెండు తెలుగు రాష్ట్రాలకు మరింత మంచిదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేసుకునే అవకాశం రెండు తెలుగు రాష్ట్రాలకూ కనిపించడం లేదన్నారు. పైగా ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా.. పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలతో ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ”మీరు అప్పులు చేస్తున్నారంటే.. మీరు అప్పులు చేస్తున్నారని ఒక పార్టీపై మరోపార్టీ విమర్శలు చేస్తున్నారు.

మళ్లీవారు అధికారంలోకి వస్తే.. అదే పని చేస్తున్నారు” అని దుయ్యబట్టారు.ఉచిత పథకాలు కేవలం అర్హులైన వారికి మాత్రమే అందాలని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి ఉచితాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల అసలైన అర్హులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్యం అనే ఈ రెండు రంగాల్లో మాత్రమే ఉచితాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయని.. లేకపోతే అప్పులు పెరుగుతాయని హెచ్చరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: