కాణిపాకం Vedapathashala : రాషంలోని వైధిక యూనిర్సిటీ అనుమతులు తీసుకుని కాణిపాకం దేవస్థానంలో వేదపాఠశాలను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) అన్నారు. కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్స వాల్లో భాగంగా బుధవారం వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం సుమారు 4 కోట్లు రూపాయలతో అధునాతనంగా నిర్మించిన అన్నప్రసాద వితరణ భవన్ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం సనాతన ఆచారాలకు, సనాతన ధర్మానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈమేరకు వైదిక యూనివర్సిటీ కాణిపాకంలో వేదపాఠశాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే అనుమతులు తీసుకుని త్వరలో రాష్ట్రంలో 600 ఆలయాలకు పాలకమండళ్ళును నియమించడం జరిగిందన్నారు. మిగిలిన మరో 300 ఆలయాలకు కూడా పాలక మండలిల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, దుర్గగుడి, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాలకు పాలకమండలిల ఏర్పాటుకు సీఎం ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఆలయాలకు పాలకమండలిలు త్వరలోనే
త్వరలో ఈ ఆలయాలకు పాలకమండలిలను ఏర్పాటు చేయనున్నట్ల తెలిపారు. అలాగే దేవాదాయశాఖలో ఖాళీగా వున్న 500 పోస్టులను (Posts) త్వరలో భర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలోని 5,250 ఆలయాలకు ధూపదీప వైవేద్యం కోసం ప్రతి నెలా 10 వేల రూపాయలు వంతును నిధులను ఆలయాలకు చెల్లిస్తున్నట్లు మంత్రి రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో జరిగే నిత్యకైంకర్యాలు, పూజాధి కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరగాలని, ఇందులో పాలకమండలిలు, అధికార యంత్రాంగం, ప్రభుతం కాని జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృది సాధించే విధంగా ఆశీర్వాదం అందించాలని స్వామివారికి తాము వేడుకున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. ఈవిలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, దేవాదాయశాఖ కమీషనర్ రామచంద్రమోహన్, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కలికిరి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :