వందే భారత్ (Vande Bharat) రైళ్ల విస్తరణలో భాగంగా, రైల్వే శాఖ మరో కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తోంది. విజయవాడ-బెంగళూరు (Vijayawada-Bangalore) మధ్య వందే భారత్ రైలు నడిపే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ రైలు ప్రారంభమైతే ప్రయాణికులకు ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటల వరకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న సాధారణ రైళ్లకు మారుగా వేగవంతమైన వందే భారత్ రైలు ప్రయాణికులకు వేగంగా, సౌకర్యంగా గమ్యస్థానానికి చేరేందుకు సహకరించనుంది.
బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్
ఈ రైలు ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. proposed స్టాపేజెస్‌లో విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, KR పురం స్టేషన్లు ఉంటాయి. ప్రయాణదూరాన్ని వేగంగా కవర్ చేయడమే కాకుండా, ముఖ్య పట్టణాలకు అనుసంధానాన్ని మెరుగుపరచేలా ఈ రైలు ప్రయోజనకరంగా మారనుంది. ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు ఇది ఓ శుభవార్తగా మారుతోంది.
ప్రయాణికుల నుంచి మంచి స్పందన
ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై, విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించడంతో, ఇప్పుడు బెంగళూరు మార్గాన్ని కూడా వందే భారత్ సేవల్లోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకసారి ఈ రైలు ప్రారంభమైతే, ఇది ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Read Also : Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి