हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Vahana Mitra – రూ.15 వేల వాహన మిత్ర కుగ్రీన్ సిగ్నల్

Anusha
Latest News: Vahana Mitra – రూ.15 వేల వాహన మిత్ర కుగ్రీన్ సిగ్నల్

కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం

విజయవాడ : నాలా ఫీజు రద్దు చట్ట సవరణకు ఆమోదం, వాహనమిత్ర కింద రూ.15 వేల సాయానికి కీలక నిర్ణంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే 13 బిల్లులకు ఏపీ మంత్రి మండలి సమావేశం ఆమోదముద్రవేసింది. భారీ ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, ఏపీ జీఎస్టీ బిల్లు 2025 సవరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

ఈ భేటీలో ప్రజలకు లబ్ధి చేకూర్చే పలు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేటప్పుడు విధించే నాలా (వ్యవసాయేతర భూముల మదింపు) ఫీజును రద్దు చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమా వేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను రాష్ట్ర హోంమంత్రి అనిత (Home Minister Anita) మీడియాకు వెల్లడించారు.

వేగవంతమైన అమలుకోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్

వాహనమిత్ర పథకం (Vahanamitra Scheme) కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. అసెంబ్లీ సమా వేశాల్లో ప్రవేశపెట్టేందుకు వీలుగా మొత్తం 13 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హోంమంత్రి వివరించారు.

వీటిలో ఏపీ జీఎస్టీ బిల్లు 2025 (AP GST Bill 2025) కు సంబంధించిన సవరణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించినట్లు ఆమె తెలిపారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఇక వివిధ బిల్లులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

Vahana Mitra
Vahana Mitra 

ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్ నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో (municipal administration) ని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను

రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేశారు.

రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకునేందుకు క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లిప్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు సంబంధించి మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలిపారు.

ప్రతిపాదనలకు కేబినెట్లో

పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు కన్వర్షన్కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్లో ఆమోదముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు ఈ అసెంబ్లీ సమా వేశాల్లో సభముందుకు తీసుకువచ్చే పలు బిల్లు లకు మంత్రిమండలిలో ఆమోదముద్ర పడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cm-chandrababu-good-news-for-onion-farmers/andhra-pradesh/550731/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870