ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం (POLAVARAM PROJECT) ,నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర జల సంఘం (CWC) సహా సంబంధిత సంస్థలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నీటి హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది.
Read also: Bandi Sanjay : కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

Telangana will approach the Supreme Court over the AP
సమ్మక్కసాగర్ డీపీఆర్‌కు తుది అనుమతులు ఇవ్వాలని
ఏపీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కీలక సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మైనర్ ఇరిగేషన్ కింద ఆదా చేసిన 45 టీఎంసీల నీటితో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలి దశకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని, సమ్మక్కసాగర్ డీపీఆర్‌కు తుది అనుమతులు ఇవ్వాలని కోరింది. ప్రాణహిత చేవెళ్ల, సీతారామ, ముక్తేశ్వర్ వంటి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: