Urea : రాష్ట్రంలో ప్రస్తుతం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు 6.22 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, ప్రారంభనిల్వతో కలిపి 6.57 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను (Metric tons of urea) వివిధ ఏజెన్సీల నుంచి రైతులకు అందుబాటులో ఉంచగా, 5.48 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటి వరకూ విక్రయించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీ గోదాముల్లో 4,880 మెట్రిక్ టన్నులు, హోల్ సేల్ వ్యాపారుల వద్ద 2,774 మెట్రిక్ టన్నులు, మార్కెఫెడ్ గోదాముల్లో 25,523 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు రిటైలర్స్ వద్ద 27,595 మెట్రిక్ టన్నులు, పిఎసిఎస్ వద్ద 7,815 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 18,082 మెట్రిక్ టన్నులు, రవాణాలో 22,083 మెట్రిక్ టన్నులు చొప్పున మొత్తంగా 1,08,652 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. గత ఖరీఫ్ సీజన్ కంటే ప్రస్తుత సీజన్లో 84,526 మెట్రిక్ టన్నుల యూరియా అధనంగా రాష్ట్రానికి కేటాయించినట్లు తెలిపారు.

ఆగస్టుకు 1.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 83 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి సరఫరా చేశారని, ఇంకా 82 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కరైకల్ ఓడరేవు నుంచి 8,100 మెట్రిక్ టన్నులు కేటాయించగా, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 7 వరకూ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా నిల్వ ఎంత ఉంది?
రాష్ట్రంలో ప్రస్తుతం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. కంపెనీ గోదాములు, మార్కెఫెడ్ గోదాములు, ప్రైవేటు రిటైలర్లు, రైతు సేవా కేంద్రాలు వంటి అన్ని వనరుల ద్వారా రైతులకు యూరియా అందుబాటులో ఉంది.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ఎంత యూరియా కేటాయించబడింది?
ఈ సీజన్‌కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించబడింది. ప్రారంభ నిల్వలను కలిపి రైతులకు 6.57 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 5.48 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే విక్రయించబడ్డాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :