ఉరవకొండ(Uravakonda) ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన వైద్య సంఘటనకు సాక్ష్యంగా నిలిచారు. సాధారణ శిశువుల కంటే ఎక్కువ బరువుతో, సుమారు 4.3 కిలోల బరువు కలిగిన ఆడ శిశువు ఇక్కడ జన్మించింది. ప్రసవం సజావుగా జరిగిందని, శిశువు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Read also: Chandrababu Naidu: నీళ్ల లెక్కలు త్వరలో అన్నీ బయటపెడతా!

ఆసుపత్రిలో అరుదైన ఘటనకు వైద్యుల అభినందనలు
ఈ విజయవంతమైన డెలివరీలో నర్సులు శ్రీదేవి, అర్చన, రజిని కీలకంగా వ్యవహరించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లి, శిశువు ఇద్దరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
సాధారణంగా అధిక బరువుతో జన్మించే శిశువులకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరం ఉంటుందని వైద్యులు(Doctors) పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి సంక్లిష్టతలు తలెత్తలేదన్నారు. ఆసుపత్రి సిబ్బంది సమన్వయం, అంకితభావం ఇందుకు కారణమని అధికారులు ప్రశంసించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: