Uppada Beach: కాకినాడ జిల్లా ఉప్పాడ (uppada) తీరంలో మళ్లీ బంగారు రేణువుల వేట ప్రారంభమైంది. తుఫాన్ తర్వాత సముద్ర అలలు ఎగసి పడటంతో ఇసుకలో మెరుస్తున్న బంగారు కణాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త తెలిసి ఉప్పాడ తీరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి బంగారం కోసం అన్వేషణ ప్రారంభించారు. స్థానిక మత్స్యకారుల ప్రకారం, ప్రతి తుఫాన్ తర్వాత సముద్రం నుంచి అలలతో పాటు అనేక పదార్థాలు ఒడ్డుకు చేరుతాయి. ఆ ఇసుకలో కొన్నిసార్లు బంగారు రేణువులు కూడా ఉంటాయని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇసుకలో బంగారం కోసం తవ్వుతున్నారు. కొందరికి చిన్న బంగారు కణాలు దొరకడంతో మరింత ఉత్సాహం వ్యక్తమవుతోంది.
Read also: Kurnool Bus Accident:తన మాట వినలేదని .. చేబుతున్న ఎర్రిస్వామి

Uppada Beach
Uppada Beach: తుఫాన్ ప్రభావం కారణంగా ఉప్పాడ తీరప్రాంతం ప్రస్తుతం జనంతో కళకళలాడుతోంది. బంగారు రేణువుల వేట స్థానికులకు ఆసక్తికరంగా మారింది, కానీ అధికారులు సముద్ర తీరంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: