గిరిజన విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీయడమే ఉద్దేశంగా నిర్వహిస్తోన్న ఉద్భవ్ 2025 (Udbhav 2025) సాంస్కృతిక ఉత్సవాలలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. కేఎల్ యూనివర్శిటీ వద్ద చిన్నారులు ప్రదర్శించే కళలతో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు నిర్వహించిన పోటీల ఫలితాలలో త్రిపుర, సిక్కిం, ఏపీ, ఒడిశా రాష్ట్రాల హవా సాగింది. రెండో రోజు నిర్వహించిన క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీలలో విద్యార్థులు మెరిశారు. రెండో రోజు మొత్తం 22 కవిభాగాలలో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
Read also: Cases of Scrub Typhus : ఏపీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిగ్గర్ అనే పురుగు

సాంస్కృతిక ఉత్సవాల్లో చిన్నారుల సందడి
ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 4.30 గం.ల వరకు పోటీలు నిర్వహించారు. ఇప్పటికే పలు కవిభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడించారు. ప్రధాన వేదిక కృష్ణ జింక వద్ద జరుగుతున్న డ్రామా పోటీలను వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. జాస్మిన్ హాల్(Jasmine Hall) వద్ద జరుగుతున్న శాస్త్రీయ సంగీత, నృత్య పోటీల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ప్రాంతీయ జానపద బృంద
నృత్యం, దేశభక్తి బృందగానం, గిరిజన సంప్రదాయ నృత్యం, కథ చెప్పడం, సృజన రచన, చిత్రలేఖనం వంటి పోటీలలో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు.
11 పతకాలతో ఐదవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉద్భవ్ 2025(Udbhav 2025) ఉత్సవాలలో తొలి రెండు రోజులు కలిపి మొత్తం 46 ఈవెంట్లలో ఇప్పటివరకు 29 ఈవెంట్లు పూర్తయ్యాయి. అత్యధికంగా 22 పతకాలు సాధించి ఒడిషా రాష్ట్రం తొలి స్థానంలో సాధించింది. తెలంగాణ రాష్ట్రం 20 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 16 పతకాలతో సిక్కిం 16, 13 పతకాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. 11 పతకాలతో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానాలలో నిలిచాయి. అయితే, శాస్త్రీయ సంగీతం, ఆశుకవిత్వం విభాగాలలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసిడి పతకం దక్కింది. దేశభక్తి గ్రూప్ సాంగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఆశుకవిత్వం ఇంగ్లీష్ సీనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం దక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: