ఉద్భవ్ 2025కు సర్వం సిద్ధం
3 రోజుల పండుగకు తరలివచ్చిన అడవి బిడ్డలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్(Udbhav 2025) తొలిసారి జాతీయ స్థాయి ఉత్సవాలు. మరో అద్భుతమైన వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదిక కాబోతోంది. గిరిజన విద్యార్థుల ఆటపాటలు, వారి సంస్కృతి సంప్రదాయాలు ఒకే వేదికపై కనువిందు చేయనున్నాయి. అడవిబిడ్డలలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఖిఉద్భవ్2025ఖి సిద్ధమైంది. గిరిజన సంస్కృతి, కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అమరావతి రాజధానిలోని కేఎల్ లక్ష యూనివర్శిటీలో మూడు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే క్రిష్ మస్కట్ పేరును ఖరారు చేశారు. జాతీయ స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎమ్హర్ఎస్) సాంస్క ృతిక ఉత్సవాలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగడం తొలిసారి. బుధవారం ఉదయం 10గం.లకు అట్టహాసంగా ప్రారంభమయ్యే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర గిరిజన వ్యవ హారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ హాజరవుతున్నారు. విద్యార్థుల పోటీల కోసం మొత్తం 12 వేదికలను సిద్ధం చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు సంబం ధించి ఏకంగా 35 విభాగాల్లో పోటీలు జరగను న్నాయి. నాటకాలు, గాత్ర సంగీతం, వాయిద్యం, జానపద సంగీతం, భక్తి, దేశభక్తి, నృత్యం, లలిత సంగీతం, క్విజ్, సాంప్రదాయ గిరిజన నృత్యం వంటి విభాగాల్లో ప్రతిభ చూపేం దుకు చిన్నారులు ఉత్సాహం కనబరుస్తున్నారు.
Read also: లాభాల పేరుతో భారీ మోసం .. స్కామ్‌పై బాధితుల ఆగ్రహం

తరలివచ్చిన మినీ భారతం: గిరిజన ప్రాంతాల
పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను(Udbhav 2025) వెలికితీయడమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం. ఇది గిరిజన బిడ్డలకు దక్కిన అద్భుతమైన అవకాశం. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు దాదాపు 22 రాష్ట్రాల నుంచి 1800పైగా చిన్నారులు తరలివచ్చారు. డిసెంబర్ 3,4,5 తేదీలలో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు తమ ప్రతిభచాటనున్నారు. మన రాష్ట్రంలోని 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఎంపికైన 110 మంది ప్రతిభావంతులు కూడా తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు సమాయత్తమయ్యారు. అంగరంగ వైభవంగా నిర్వహించనున్న 6వ జాతీయ స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎస్ఆర్ఎస్) సాంస్కృతిక ఉత్సవాలకు కేంద్ర మంత్రులు సహా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,(Chandrababu Naidu) ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్ పర్సన్ లు, ఐఏఎస్లు పాల్గొననున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: