ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే సదుపాయాలను మరింత విస్తరించడానికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని అమరావతి,గన్నవరం ప్రాంతాల్లో కొత్త రైల్వే టెర్మినల్స్ (Rail Terminals) నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాబోయే సంవత్సరాల్లో రైల్వే రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Read Also: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా
విజయవాడ (Vijayawada station) స్టేషన్‌పై భారం తగ్గించడానికి ఈ టెర్మినల్స్ ఉపయోగపడతాయి. విజయవాడ, గుంటూరు స్టేషన్లను కూడా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిలో 8 ప్లాట్‌ఫాంలతో ఒక పెద్ద టెర్మినల్ నిర్మించనున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు కూడా చేస్తారు.
గన్నవరంలో మరో టెర్మినల్ అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ విస్తరణ పనుల వల్ల విజయవాడ, గుంటూరు స్టేషన్ల మీదుగా మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంది.అమరావతిలో 120 రైళ్లు సులభంగా వచ్చి వెళ్లేలా ఒక కొత్త రైల్వే టెర్మినల్ (Rail Terminals) (Rail Terminals) నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో ప్రధాన స్టేషన్
రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో ప్రధాన స్టేషన్‌ను ఒక పెద్ద కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తారు.

కోచింగ్ టెర్మినల్ అంటే, రైళ్లు బయలుదేరే స్టేషన్ లేదా రైళ్లు ఆగిపోయే స్టేషన్. అక్కడ రైళ్ల కోచ్‌ల మెయింటెన్స్ కూడా చూసుకుంటారు. ఈ కొత్త టెర్మినల్‌లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి.
ఈ కొత్త టెర్మినల్ అమరావతితో పాటు
ప్రతి ప్లాట్‌ఫామ్‌పై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండే రైళ్లు నిలబడతాయి. భవిష్యత్తులో 120 రైళ్లు వచ్చి వెళ్లేలా దీన్ని నిర్మిస్తున్నారు. రైళ్లు ఆగిపోయే కోచ్‌లను సరిచేయడానికి 6 పిట్ లైన్లు కూడా కడతారు.అందులో ఒకటి వందేభారత్ రైలు కోసం ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్టుకు మొత్తం 300 ఎకరాల స్థలం అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కోరింది. ఈ కొత్త టెర్మినల్ అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: