పోలీసు కస్టడీలోనే నిందితుడు ఆత్మహత్య చెరువులో దూకి మృతి
కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతంలో జరిగిన మైనర్ బాలికపై అఘాయిత్యం(Tuni) కేసులో సంచలనం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత తాటిక నారాయణరావు, మైనర్ బాలికపై దారుణం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్‌కు వెళ్తా అని చెప్పి వాహనం నుండి దిగిన నారాయణరావు, తుని కోమటిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. రాత్రంతా గజ ఈతగాళ్లు వెతికినా శవం దొరకకపోగా, ఉదయం పోలీసులు బాడీని వెలికితీశారు. నిందితుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని, లేక అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read also: ఈరోజు బంగారం ధర: వివిధ కేరట్ల తేడాలు మరియు సరైనది ఎంచుకోవడం ఎలా

దారుణం వీడియోతో బహిర్గతం
తుని ఘటనలో నిందితుడు తాటిక నారాయణరావు,(Tuni) గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను తాతయ్య వరుస అవుతా అని నమ్మించి, స్కూల్ నుండి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టగా, కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదంతా గమనించిన ఓ వ్యక్తి నిందితుడిని ఫాలో అవుతూ మొబైల్‌లో వీడియో తీశాడు. వీడియోలో బాలిక దుస్తులు సరిచేసుకుంటూ ఉండగా, ఆ వ్యక్తి “ఏం చేశావ్?” అని నారాయణరావును ప్రశ్నించగా, అతడు “ఏం చేస్తావో చేసుకో” అంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: