తిరుమల: టోకెన్లు ఆఫ్ లైన్ లోనే ఇవ్వాలంటున్న భక్తులు: ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల ఆలయంలో వైకుంఠద్వారం తెరచి భక్తులకు కల్పించే దర్శనాల్లో స్థానికులకు ప్రాధాన్యతనిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఐదేళ్ళ క్రిందట వరకు రెండురోజులు మాత్రమే (48గంటలు) వైకుంఠ ద్వారాలను తెరచి వుంచి దర్శనం చేయించే సందర్భంలో ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేకున్నా సరాసరి భక్తులను నేరుగా తిరుమలకు (TTD) అనుమతించి వైకుంఠమ్ 1,2 క్యూకాంప్లెక్స్ లు నిండితే నారాయణగిరి ఉద్యానవనాలు, తరువాత ఔటర్రింగురోడ్డు మీదుగా భక్తులను క్యూలైన్లలో అనుమతించేవారు. అందుకు తగ్గట్లు భక్తులకు కూడా తిరుమలలోనే సకల సౌకర్యాలు కల్పించి నిరంతరాయంగా అల్పాహారం, అన్నప్రసాదాలు, మంచినీరు. కాఫీ, పాలు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
Read also: Abdul Nazeer: గవర్నర్, డిప్యూటీ సీఎం నేడు పుట్టపర్తికి రాక

Will locals be allowed to visit Vaikuntha Dwara
ఎస్ఇడి టిక్కెట్లు 25వేల వరకు
అంతేగాక తిరుపతిలోనే కేవలం 60వేల వరకు ఎస్ఎస్ఈ టోకెన్లు స్థానికులకు మాత్రమే జారీచేసేవారు. బయటి వ్యక్తులు ఎవరూ కూడా తిరుపతికి చేరుకునేవారు కాదు. గత ఐదేళ్ళుగా వైకుంఠద్వార దర్శనాలను పదిరోజులు చేయడం, ఎలాంటి దర్శన టిక్కెట్, టోకెన్ లేని భక్తులను తిరుమలకు అనుమతించడం లేదు. పైగా రోజువారీ టోకెన్లు కూడా ఆయారోజుల్లో జారీచేయక ఒకేదఫాగా వరుసగా టోకెన్లు జారీచేసే విధానం వల్ల కూడా పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఇందుకు ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన టిటిడి విషాద ఘటనలే నిదర్శనం. అయితే ఆన్లైన్లో 300 రూపాయలు ఎస్ఇడి టిక్కెట్లు 25వేల వరకు జారీచేసేవారు. ఇతర దర్శనాలన్నీ రద్దుచేసేవారు. అప్పట్లో చక్కటి ప్రణాళికలతో అధికారులు చిన్నపాటి లోటుపాటు లేకుండా భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు చేయించిన సందర్భాలు ఎక్కువ.
ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది
ఇప్పుడు పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలు కొనసాగిస్తుండటంతో డిసెంబర్ 30,31తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు స్థానికులకు మాత్రమే టోకెన్ అవకాశం కల్పించడం మంచిదని భక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ లైన్ లోనే అందుకున్న వాళ్ళు ఆ రెండురోజులు తిరుమలకు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది టిటిడి వర్గాల్లో కూడా వినిపిస్తున్న వాదనలు. 2026 జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం సెంటిమెంట్ ఉండటంతో భక్తులు ఆఫ్ లైన్ లోనే ముందుగా టోకెన్లు అందుకునే వీలు కల్పించాలని సూచనలు వస్తున్నాయి. జనవరి 8వతేదీ వరకు కొనసాగే వైకుంఠద్వార దర్శనాలను ఆఫ్లైన్లో తిరుపతిలో ఏరోజుకారోజు ముందుగా జారీ చేస్తే భారీగా భక్తులు చేరుకునే వీలుండదు. పైగా రద్దీని కట్టడిచేసే అవకాశం కలుగుతుంది. మరీ టిటిడి అధికారులు ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ కొంత అనుభవం ఉండటంతో స్థానికులకోసం కేటాయించిన వైకుంఠద్వార దర్శనాలు ఆ రెండురోజులు వారికే ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. ఏకంగా ఆఫ్ లైన్ లో టోకెన్లు జారీచేస్తే సామాన్యభక్తులు, స్థానికులు వైకుంఠద్వార దర్శనాలకు దూరమై సమస్య జఠిలంగా మారుతుందనేది మరింత వినిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: