हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

News Telugu: TTD: టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rajitha
News Telugu: TTD: టిటిడి నిర్వహణలో ఎఐ ఉపయోగించండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయు స్థానమ పరకామణిలో నేరం చోరీ కంటే పెద్దది. టిటిడి పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కంటే పెద్దదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని సూచించింది. బాధ్యతారాహిత్యంతోనే పరకామణి చోరీ ఘటన జరిగిందన్న హైకోర్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది. టిటిడిలో అవుట్ సోర్సింగ్ నియామకాలు సరికాదన్న న్యాయస్థానం విరాళాల లెక్కింపు వద్ద టేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. విరాళాల లెక్కింపు కోసం భక్తులను ఎందుకు తీసుకోకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. టిటిడి నిర్వహణలో ఎఐని ఉపయోగించాలని హైకోర్టు సూచించింది.

Read also: AP: స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!

Use AI in TTD's management

Use AI in TTD’s management

తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానంలో జరిగిన హుండీ కానుకల లెక్కింపు కేంద్రం పరకామణిలో దొంగతనం కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసింది. విరాళాల లెక్కింపులో అవకతకవలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఇది కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా అభిప్రాయపడింది. పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కంటే మించిందనే భావనను వ్యక్తం చేసింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఎంత మాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసు విచారణలో భాగంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీకి గురైతే కోట్లాదిమంది భక్తుల మనో భావాలు దెబ్బతింటాయని తెలిపింది.

ఎఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తే

పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకీకరించాల్సిన అవసరముందని వెల్లడించింది. మనుషుల ప్రమేయాన్ని తగ్గించి, యంత్రాలు, ఎఐ టెక్నాలజీని వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి చోరీ ఘటనలు తరచూ జరుగుతున్నా కానుకలు లెక్కించేందుకు పాత విధానాన్ని అనుసరించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. విరాళాల లెక్కింపు, భద్రత, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఎఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తే మానవతప్పిదాలు, అక్రమాలకు తావు ఉండదని న్యాయస్థానం సూచించింది. భక్తుల సమక్షంలో లెక్కింపు జరిగితే పారదర్శకత పెరుగుతుందని నమ్మకం మరింత బలపడుతుందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విజిలెన్స్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించాలని సూచించంది. కానుకలు లెక్కింపునకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అక్రమాలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు

ఈ విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలంటూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏప్రిల్ 2023లో టిటిడికి చెందిన ఒక మఠం ఉద్యోగి సి.వి. రవికుమార్ పరకా మణి హాల్ లో సుమారు 900 అమెరికన్ డాలర్లను దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ దొంగతనం కేసులో విచారణ జరపకుండానే, నిందితుడు రవికుమార్ తిరుపతి చెన్నైలోని తనకున్న 7 ఆస్తులను టిటిడికి విరాళంగా ఇచ్చేలా సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చారు. ఈ రాజీ వెనుక ఉన్న అక్రమాలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ, ఏసీబీ దర్యాప్తు చేపట్టాయి. రెండు సంస్థలకు కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడైన మాజీ ఎవిఎస్ వై. సతీష్ కుమార్ గత నెల 13వ తేదీన అనంతపురం జిల్లాలో రైల్వే ట్రాక్పై మరణించి కనిపించారు. ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, దీనిపై హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870