TTD Updates: రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమల(Thirumala) పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి (జీసీఎస్‌కే) కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు అధ్యక్షుడికి సాదర ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు తిరుమల శ్రీవారి దర్శనం సహా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు తిరుమల(TTD Updates) శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని ఇతర ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. విదేశీ అతిథి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం మరియు తిరుమలలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: