Tirumala drone incident: తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి డ్రోన్ ఘటన భద్రతా వ్యవస్థలను అప్రమత్తం చేసింది. శుక్రవారం శిలాతోరణం ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు డ్రోన్(Drone) ఎగరేస్తున్నట్లు భక్తులు గుర్తించారు. వెంటనే ఈ విషయం టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులకు తెలిసింది. విజిలెన్స్ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

డ్రోన్ కేసులో ఇద్దరు అరెస్ట్
తర్వాత టీటీడీ(TTD) ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. డ్రోన్ ఎగరేసిన వారు ఇద్దరు ఇస్కాన్‌కు చెందిన భక్తులని, ఫారెస్ట్ మరియు విజిలెన్స్(TTD vigilance) టీములు వారిని గుర్తించి పట్టుకున్న తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపింది. పోలీసులు డ్రోన్‌లో రికార్డు అయిన ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలిపిరి చెక్‌పోస్ట్ దాటుకుని, శిలాతోరణం వద్ద భక్తులు, భద్రతా సిబ్బంది సమక్షంలోనే డ్రోన్ ఎగరేయడం కలకలం సృష్టించింది. ఘటనపై టీటీడీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ఫారెస్ట్ ఏరియాలో అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించడం కఠినంగా నిషేధమని గుర్తు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: