తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం పది రోజులపాటు నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించిన రూ.300 టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపటి నుండి విడుదల చేయనున్నారు.
Read also: AP: అమరావతికి చట్టబద్ధతకు మొదలైన ప్రక్రియ

TTD’s key announcement on Vaikuntha Dwara Darshan
జనవరి 2 నుంచి 8 మధ్య తేదీలకు సంబంధించిన రూ.300 టికెట్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి కోటాలను కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకునే విధంగా సిద్ధం చేశారు. భక్తులు తమ టికెట్లను కేవలం టీటీడీ అధికారిక పోర్టల్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భాలు ఒకేసారి రావడంతో డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల సర్వదర్శన టోకెన్లను సాధారణ భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో ఇప్పటికే కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.
కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం
కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో బుధవారం కృత్తిక దీపోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆలయం గోపురాలు, ధ్వజస్తంభంపై దీపాలు వెలిగించి నిర్వహించిన జ్వాలాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: