TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లోనే 60–80 వేల మంది దర్శనానికి రాగా, వారాంతాలు మరియు పండుగల సమయంలో ఈ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకు చేరుతోంది. అయితే తిరుమలలో అందుబాటులో ఉన్న గదులు ఈ రద్దీకి సరిపోవడం లేదు.
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల వసతి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అలిపిరి వద్ద భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.
Read also: Ganta Jishnu Aryan: మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

TTD to build an integrated township at Alipiri
ఈ టౌన్‌షిప్‌ను శిల్ప కళాశాల నుంచి ఓల్డ్ చెక్ పాయింట్ (గరుడ సర్కిల్) వరకు నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి 25 వేల నుంచి 30 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గదులతో పాటు అన్నప్రసాద కేంద్రాలు, దుకాణాలు, పార్కింగ్, లాకర్లు, స్నానపు గదులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఈ టౌన్‌షిప్‌లో ఉండే ప్రధాన సౌకర్యాలు
- సౌకర్యవంతమైన గదులు
- లాకర్లు, వందల సంఖ్యలో స్నానపు గదులు, మరుగుదొడ్లు
- ఉచిత అన్నప్రసాద కేంద్రాలు
- ప్రైవేట్ రెస్టారెంట్లు, షాపింగ్ సదుపాయాలు
- విస్తృత పార్కింగ్ వ్యవస్థ
- భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచే థియేటర్లు, పార్కులు, ఆడిటోరియంలు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: