గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం 10.30 గంటలు పాటు తిరుమలేశుని ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఆరోజు సాయంత్రం 3.20గంటల గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధాంణంగా గ్రహణ సమయానికి ఆరుగంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. మార్చి 3వ తేదీ ఉదయం చంద్రగ్రహణం (lunar eclipse) ప్రభావంతో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అన్ని దర్శనాలను రద్దుచేశారు.
Read also: Sakey Sailajanath PressMeet: రాయలసీమ పథకాలపై విమర్శలు

Total lunar eclipse on March 3rd
సాయంత్రం 7.30గంటలకు ఆలయం తలుపులు తెరచి శుద్ధి, పుణ్యా హవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం పున:ప్రారంభమవు తుంది. ఆరోజు ఆలయంలో జరగాల్సిన అష్టదళ పాద పద్మా రాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దుచేసింది. దేశవిదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు గమనించి తిరుమల యాత్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని టిటిడి కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: