हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

TTD: టిటిడికి వెర్జెస్ సంస్థ రూ.1.20కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

Rajitha
TTD: టిటిడికి వెర్జెస్ సంస్థ రూ.1.20కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

తిరుమల : గోవింద నామస్మరణతో తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించుకునే భక్తులకు అవసరమైన బ్లేడ్లును వెర్జెస్ సంస్థ 1.20కోట్ల రూపాయలు విలువైన బ్లేడ్లను విరాళంగా అందించింది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో బాటు మరో పన్నెండువరకు ఉన్న మినీ కల్యాణకట్టల్లో భక్తులకు తీసేందుకు బ్లేడ్లు తలనీలాలు అవసరమవుతున్నాయి. ఈ బ్లేడ్లను తయారీసంస్థ వర్జెస్ డైరెక్టర్ బొడ్డుపల్లి శ్రీధర్ బుధవారం ఉదయం తిరుమలకు చేరుకుని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. ఒక సంవత్సర కాలానికి అవసరమైన సిల్వర్ మాక్స్ సగం బ్లేడ్లను టిటిడికి (TTD) విరాళమిచ్చారు. తిరుమలలో రోజుకు సుమారు 40వేల వరకు బ్లేడ్లును కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి టిటిడి 1.16కోట్లు రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇప్పుడు వీటిని విరాళంగా అందించడంతో పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది. ఆ సంస్థ గత పదేళ్ళుగా బ్లేడ్లను తయారుచేస్తోందని ఛైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు.

Read also: TTD: తిరుమలలో రాజకీయ రీల్స్ కలకలం

TTD

TTD

సింగిల్ బ్లేడ్ ను టిటిడికి విరాళంగా

రోజుకు 50లక్షల బ్లేడ్లు తయారీ సామర్థ్యం ఉన్న ఏకైక సంస్థ వర్టిస్ అన్నారు. శ్రీవారి భక్తులకు సేవచేసే అదృష్టం టిటిడి ఛైర్మన్ ద్వారా కలగడం చాలా ఆనందంగా ఉందని శ్రీధర్ తెలిపారు. తొలిసారిగా ఎవరి దగ్గర లేని విధంగా సింగిల్ బ్లేడ్ ను టిటిడికి విరాళంగా అందించామన్నారు. తమ సంస్థ తయారుచేసిన బ్లేడ్లకు యూరఫ్, అమెరికాతోసహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7ఓక్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సింగిల్ బ్లేడ్ల వినియోగం విరివిగా జరుగుతుందన్నారు. తిరుమలలో కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు హాప్ బ్లేడ్ ను క్షురకులు చాలా సులభంగా ఉపయోగించేలా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో దేవునికి సేవచేసే అవకాశం కలుగుతుందని బొడ్డుపల్లి శ్రీధర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాతను టిటిడి ఛైర్మన్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870