తిరుమల : ఆధ్యాత్మికనగరం తిరుపతి నగరనడి బొడ్డున కొలువైన గోవిందరాజస్వామి ఆలయ మహాద్వారం రాజగోపురం పైకి మద్యం మత్తులో ఎక్కిన నిందితుడు తిరుపతి(43)ని తిరుపతి తూర్పు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ తలుపులు మూసివేసిన తరువాత శుక్రవారం రాత్రి అనధికారికంగా ఆలయంలోనికి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా వ్యవహరించిన అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం, సిఐ శ్రీనివాసులు తెలిపారు.
Read also: Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం లక్ష్యం

accused who climbed onto the temple tower has been remanded.
తిరుపతి నడిబొడ్డున చుట్టూ ప్రజలే కాపలాగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో భద్రత తీసికట్టుగా తయారవడం, శుక్రవారం రాత్రి ఆలయం తలుపులు మూసివేసిన తరువాత 11గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న తెలంగాణ నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డికాలనీకి చెందిన “కుతడి తిరుపతి”(43) గోడదూకి గోపురంపైకి చేరి భయాందోళన గోల్పించాడు. ఆలయ భద్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడంతో తిరుపతి వాసులు తీవ్రంగా పరిగణించారు. అతనిని ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది త్రాళ్ళ సాయంతో క్రిందకు తీసుకురావడం జరిగింది. ఈ తప్పిదాలకు కారణమైన టిటిడి జమేదార్ పట్టాభిరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అతనిని ఆలయం నుండి తప్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: